Rythu Bharosa : రైతు భరోసా ఎన్ని విడతల్లో ఇస్తారంటే…

Rythu Bharosa  : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో రైతు భరోసా కింద ఒక ఎకరాకు ఏడాదికి 15వేల సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు రైతులకు పెట్టుబడి […]

  • Published On:
Rythu Bharosa : రైతు భరోసా ఎన్ని విడతల్లో ఇస్తారంటే…

Rythu Bharosa  : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో రైతు భరోసా కింద ఒక ఎకరాకు ఏడాదికి 15వేల సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుండి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. దీంతో దాదాపు 70 లక్షల మంది రైతుల అకౌంట్లో రూ.7,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనున్నారు.

how-many-installments-will-rythu-bharosa-be-given

అయితే వాస్తవానికి నవంబర్ చివరి వారంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందాలి కానీ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చివరి నిమిషంలో రైతుబంధు ఆగిపోయింది. ఇక ఎన్నికల ప్రచారాలలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి 15 వేలు పంట పెట్టుబడి సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది . అదేవిధంగా కౌలు రైతులను గుర్తించి వారికి కూడా ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తామని తెలియజేసింది. అయితే ఈ సహాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో ఇస్తారా లేక, మూడు విడతలో ఇస్తారా అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మరి ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాకపోవడం వలన ఇప్పుడైతే రైతుబంధు మాదిరిగానే రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ ఆయకట్టు పెరిగిన తర్వాత కొన్ని ప్రాంతాలలో మూడు పంటలు కూడా పండిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పంటకు ముందు తర్వాత ఇలా ఏడాదిలో మూడు సార్లు రైతు భరోసా అందించాల్సిందిగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం సంక్షేమ పథకాలు అమలు చేయడం తో ప్రస్తుతం ప్రభుత్వానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. కావున మూడు విడతల్లో పంట సాయం అందించడం ద్వారా కొంతమేరకు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని మూడు విడతల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇక గత ప్రభుత్వం ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న 70 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా సహాయం అందిస్తామని తెలియజేసింది. అయితే ప్రస్తుతం కౌలు రైతులను వ్యవసాయ కూలీలను గుర్తించడానికి మార్గదర్శకాలు చేసేందుకు సమయం పడుతుంది కాబట్టి వారికి 2024 ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.