Chandrababu Naidu : కెసిఆర్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Chandrababu Naidu : రోజురోజుకీ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగియగా ఇప్పుడు ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన పార్టీ బిజెపితో కలిసి మద్దతుగా తెలంగాణలో నిలిచింది. ఈ క్రమంలోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు టిడిపి సహకరించిందని ప్రచారం […]

  • Published On:
Chandrababu Naidu : కెసిఆర్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Chandrababu Naidu : రోజురోజుకీ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగియగా ఇప్పుడు ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన పార్టీ బిజెపితో కలిసి మద్దతుగా తెలంగాణలో నిలిచింది. ఈ క్రమంలోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు టిడిపి సహకరించిందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ ను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లడంతో తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడిన విషయం అందరికీ తెలిసిందే.ఇక ఈ ఘటనలో కెసిఆర్ తొంటి ఎముక విరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

hief-minister-chandrababu-naidu-visited-kcr

ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసి కెసిఆర్ ప్రాణాలను కాపాడారు వైద్యులు. అయితే ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కి ఇలా జరగడంతో తెలంగాణ రాష్ట్రం ఆందోళనలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే కెసిఆర్ కు గాయం అయిన విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి స్వయంగా యశోద హాస్పిటల్ కు చేరుకొని సీఎం కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రాజకీయపరంగా ఎంత వైరం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన పని చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కేసీఆర్ ను కలిసి పరామర్శించేందుకు వస్తున్నారు.
hief-minister-chandrababu-naidu-visited-kcr

ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ ను పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు చేరుకున్నారు. ముందుగా కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనతో ముచ్చటించి ఆయన కేసీఆర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించమని సూచించారు. అయితే ఇలా చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించడం చాలా మర్యాదపూర్వకమనిపార్టీ నేతలు అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫ్రెండ్షిప్ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యశోద హాస్పిటల్ కు చేరుకొని కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. రాజకీయ నాయకులు ఇంతటి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ రాజకీయాలు అనే ట్రెండ్ మొదలైంది.