TSPSC Group 2 : గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ సమాచారం…పరీక్షలు నిర్వహించేది ఎప్పుడంటే…

TSPSC Group 2  : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-2 రాత పరీక్షలు పలుసార్లు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా…? లేక మరోసారి వాయిదా పడతాయా…? అనే విషయంపై గ్రూప్ 2 అభ్యర్థుల లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాల […]

  • Published On:
TSPSC Group 2 : గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ సమాచారం…పరీక్షలు నిర్వహించేది ఎప్పుడంటే…

TSPSC Group 2  : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-2 రాత పరీక్షలు పలుసార్లు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా…? లేక మరోసారి వాయిదా పడతాయా…? అనే విషయంపై గ్రూప్ 2 అభ్యర్థుల లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఇక ఈ ఉద్యోగాలకు దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక్క పోస్టుకు సగటున 75 మంది పోటీ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొన్ని అనివార్య కారణాల వలన గ్రూప్-2 రాత పరీక్షలను రెండుసార్లు వాయిదా వేయడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ 2004 జనవరిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు కార్యాచరణ చేయడం మొదలుపెట్టింది.  ఈ క్రమంలోనే జనవరి 6,7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు కూడా రాయడం జరిగింది. అయితే గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3 తో పాటు ఇతర ఉద్యోగ నియామక పరీక్షల పరిస్థితిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తీసుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే వారంలోకి పూర్తి సమీక్ష నిర్వహించి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇవ్వనన్నట్లుు తెలుస్తోంది. మరి నూతన ప్రభుత్వ పాలనలో ఎలాంటి తప్పులు జరగకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తే ఈ ప్రభుత్వం మరో మెట్టును ఎక్కినట్లే. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ పరీక్షల తీరుపై ఎలాంటి ప్రణాళికలను రూపొందిస్తారో వేచి చూడాలి.