Telangana RTC : ఉచిత బస్ కదా అని ఎక్కితే సరిపోదు…ఇవి కూడా తెలుసుకోండి…

Telangana RTC  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉన్నదన్న విషయం నిజమే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే దీనికి సంబంధించి ప్రజలలో అనేక సందేహాలు ఉన్నాయి. ఎవరెవరికి బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుంది…? ఎన్ని కిలోమీటర్ల మేరకు ఉచితంగా ఉంటుంది..? అలాగే బస్సులో రోజుకు ఎన్నిసార్లు ప్రయాణించవచ్చు..?ఇలా అనేక రకాల సందేహాలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉన్నాయి. అయితే ఈ ఉచిత […]

  • Published On:
Telangana RTC : ఉచిత బస్ కదా అని ఎక్కితే సరిపోదు…ఇవి కూడా తెలుసుకోండి…

Telangana RTC  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉన్నదన్న విషయం నిజమే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే దీనికి సంబంధించి ప్రజలలో అనేక సందేహాలు ఉన్నాయి. ఎవరెవరికి బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుంది…? ఎన్ని కిలోమీటర్ల మేరకు ఉచితంగా ఉంటుంది..? అలాగే బస్సులో రోజుకు ఎన్నిసార్లు ప్రయాణించవచ్చు..?ఇలా అనేక రకాల సందేహాలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉన్నాయి. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కర్ణాటక రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఏ విధంగా దీని ఫలితాలు ఉండబోతున్నాయి.. మరి మహిళలకు ఈ బస్సు ప్రయాణం అనేది కలిసి వస్తుందా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా…అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే తప్పకుండా 6 గ్యారెంటీలను నెరవేరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 9వ తేదీన ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పల్లె వెలుగు, ఆర్డినరీ , ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ బస్సు సౌకర్యాన్ని మహిళలు ,చిన్నపిల్లలు, ట్రాంజెండర్లు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఇక దీనికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ సహకరించాలని కూడా అధికారి యంత్రాంగం ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఉచిత బస్సు ప్రయాణం గురించి ఉన్నతాధికారులతో టీఎస్ ఆర్టీసీ ఎండ్ సర్జన్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను తెలియజేశారు..

అయితే వారు చెబుతున్న లెక్క ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్ఛా అంటే కాదనే చెప్పాలి. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర స్థానిక ఐడెంటి కార్డు లేదా ఆధార్ కార్డును తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రూఫ్ ను కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ ఉచిత ప్రయాణం అనేది వర్తిస్తుంది. ఇక వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ వివసించే వారికి ఇది ఏమాత్రం వర్తించదు. అయితే హైదరాబాదులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే వాళ్ళే ఎక్కువ. ఇలా వలస వచ్చిన వారికి తెలంగాణ స్థానికత ఉండదు. కాబట్టి వారికి వారి ఊర్లోనే ఆధార్ కార్డులు వారి ఐడెంటిటీ ఉంటాయి. ఇక అవి ఇక్కడ ఏ మాత్రం పనిచేయవు కాబట్టి వారికి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం వర్తించదని అధికారులు తెలియజేశారు. అది మినహాయించి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఎన్నిసార్లైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా తెలంగాణ విస్తరించి ఉన్న ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎంత దూరమైనా సరే ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర పరిధి దాటినచో కచ్చితంగా చార్జెస్ తీసుకుంటారు.