Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికైన గడ్డం ప్రసాద్…అత్యుత్తమ గౌరవం అందుకున్న తొలి దళిత నేత…

Gaddam Prasad Kumar : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరిగింది. అయితే గతంలో రేవంత్ రెడ్డి తో సహా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా… ఈరోజు శాసనసభ సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరిగింది. అయితే ముందుగా ప్రో టెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ గడ్డం ప్రసాద్ ను అసెంబ్లీ స్పీకర్ గా అధికారికంగా […]

  • Published On:
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికైన గడ్డం ప్రసాద్…అత్యుత్తమ గౌరవం అందుకున్న తొలి దళిత నేత…

Gaddam Prasad Kumar : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరిగింది. అయితే గతంలో రేవంత్ రెడ్డి తో సహా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా… ఈరోజు శాసనసభ సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరిగింది. అయితే ముందుగా ప్రో టెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ గడ్డం ప్రసాద్ ను అసెంబ్లీ స్పీకర్ గా అధికారికంగా ప్రకటించారు. అనంతరం స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు. ఈ నేపద్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా ఎంపిక చేయడంపై అన్ని పార్టీలు సహకరించాయని అసెంబ్లీ స్పీకర్ గా తొలిసారి దళిత నేతను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

gaddam-prasad-who-was-selected-as-telangana-assembly-speaker-is-the-first-dalit-leader-to-receive-the-highest-honour

అనంతరం సభాపతిని పోడియం వరకు తీసుకెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక దీనిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ,దానం నాగేందర్, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తదితరులు కరచాలనం చేస్తూ కొత్తగా ఎంపికైన స్పీకర్ కు అభినందనలుు తెలియజేశారు. ఇక గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే ఎంపీటీసీగా రాజకీయాలలోకి తొలి అడుగు వేసిన గడ్డం ప్రసాద్ నేడు శాసనసభాపతిగా ఎన్నికయ్యారు. ఇక ఈయన 21 ఏళ్ల ప్రాయంలోని రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. గడ్డం ప్రసాద్ మర్పల్లి అనే గ్రామంలో 1964లో జన్మించడం జరిగింది. 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గడ్డం ప్రసాద్ 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.  ఈ క్రమంలోనే వికారాబాద్ లో అఖండ విజయాన్ని సాధించి, 2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు.

gaddam-prasad-who-was-selected-as-telangana-assembly-speaker-is-the-first-dalit-leader-to-receive-the-highest-honour

ఆ తర్వాత 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా గడ్డం ప్రసాద్ వ్యవహరించారు. ఆ తర్వాత గడ్డం ప్రసాద్ 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమిలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022లో టిపిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ నియమితులయ్యారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ సమావేశాలలో గడ్డం ప్రసాద్ ను అన్ని పార్టీలు స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. అయితే గడ్డం ప్రసాద్ అభ్యర్థిత్వానికి బిజెపి పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపి మినహా 63 మంది కాంగ్రెస్ సభ్యులు ,39 మంది బిఆర్ఎస్ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం, సిపిఐ కి చెందిన ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్ కు మద్దతు ఇవ్వడంతో ,ఏకగ్రీవంగా ఎన్నికై సభాపతి స్థానంలో గడ్డం ప్రసాద్ కూర్చున్నారు.