Viral News : బస్సుల్లో ఉచిత ప్రయాణం దెబ్బ… రేవంత్ కు సెగ… ప్రజా భవన్ వద్ద ఆటోలు తగలబెట్టిన డ్రైవర్…

Viral News : తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి అమలులోకి తీసుకువచ్చారు. అయితే మహాలక్ష్మి పథకం కింద ఆడవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. అయితే ఈ పథకం వలన ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే ఆటో డ్రైవర్లు అని చెప్పవచ్చు. ఈ పథకం వలన ఆటో డ్రైవర్ల బతుకుల మీద దెబ్బతీసినట్లు అయింది. ఈ పథకం […]

  • Published On:
Viral News  :  బస్సుల్లో ఉచిత ప్రయాణం దెబ్బ… రేవంత్ కు సెగ… ప్రజా భవన్ వద్ద ఆటోలు తగలబెట్టిన డ్రైవర్…

Viral News : తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి అమలులోకి తీసుకువచ్చారు. అయితే మహాలక్ష్మి పథకం కింద ఆడవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. అయితే ఈ పథకం వలన ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే ఆటో డ్రైవర్లు అని చెప్పవచ్చు. ఈ పథకం వలన ఆటో డ్రైవర్ల బతుకుల మీద దెబ్బతీసినట్లు అయింది. ఈ పథకం వలన వారికి ఒక్క పూట కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. 6 గ్యారంటీల లో మహిళలకు ఉచిత ప్రయాణం వసతి కల్పించడానికి ఈ పథకాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు.

అయితే ఈ పథకం ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయని వారు ముందుగా ఊహించలేదు. ఈ పథకం అమలు చేయడానికి ముందు వరకు ప్రజలు ఆటో లు ఎక్కేవారు. అలాగే గంటల కొద్దిగా బస్ స్టాప్ లో ఉండలేక బస్సులలో ఎక్కువ మంది ప్రయాణించడం వలన వారికి ఇబ్బంది కలగడంతో ఆటోల వైపు వారు మొగ్గు చూపించేవారు. కానీ ప్రస్తుతం ఈ పథకం వలన ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పుడు వారి జీవన ఉపాధి కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత వారికి పూట కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. వారి జీవితం తలకిందులైంది. ఈ పథకం అమలు చేయడానికి ముందు ఆటో డ్రైవర్లకు ఎలాంటి మార్గాలను చూపించలేకపోయింది.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ పథకం ఎత్తివేయాలని ఆటో డ్రైవర్స్ నిరసనలు చేస్తూ వచ్చారు. బస్సులో బిక్షాటన చేశారు మరియు జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ప్రతినిధులు డిమాండ్ చేయట్లేదు కానీ తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపాలని ఆటో డ్రైవర్లు యూనియన్ పట్టబడుతున్నారుఅయినా గాని ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే వారి దుస్థితి దారుణంగా ఉండడంతో కడుపు మండిన ఒక ఆటో డ్రైవర్ ప్రజా భవన్ వద్ద తనకు తిండి పెట్టే ఆటోను కిరోసిన్ తో తగలబెట్టి నిరసన తెలియజేశాడు. తమ దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని రోడ్డు మీద కంటతడి పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది.