Sridhar Babu : రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

Sridhar Babu  : కాంగ్రెస్ ఆగ్రనేతల సమక్షంలో వేలాది మంది అభిమానులు కార్యకర్తల కోలాహాలం మధ్య రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో పదకొండు నేతలతో మంత్రులతోను ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఆయనతోపాటు దామోదర్, రాజనర్సింహ ,ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ […]

  • Published On:
Sridhar Babu : రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

Sridhar Babu  : కాంగ్రెస్ ఆగ్రనేతల సమక్షంలో వేలాది మంది అభిమానులు కార్యకర్తల కోలాహాలం మధ్య రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో పదకొండు నేతలతో మంత్రులతోను ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఆయనతోపాటు దామోదర్, రాజనర్సింహ ,ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామని వారు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సచివాలయంలో సీఎంగా తన బాధ్యతలను స్వీకరించారు.

అనంతరం కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఇక ఈ క్యాబినెట్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం విషయంలో ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, అలాగే అమలు చేసిన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించి వాటిని కూడా పరిష్కరిస్తామని మంత్రి తెలియజేశారు. అయితే డిసెంబర్ 9 నుంచి ఆధార్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి చెప్పుకొచ్చారు.