Revanth Reddy : 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచి..

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలుస్తోంది. అవి ఏమిటంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు పేద మహిళలకు 500 గ్యాస్ సిలిండర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ కాంగ్రెస్ లోక్ సభా ఎన్నికల కి శంఖం పూరిస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఇక దీనికి పునర్ నిర్వహణ సభ అని పేరు పెట్టి త్వరలోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి […]

  • Published On:
Revanth Reddy : 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచి..

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలుస్తోంది. అవి ఏమిటంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు పేద మహిళలకు 500 గ్యాస్ సిలిండర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ కాంగ్రెస్ లోక్ సభా ఎన్నికల కి శంఖం పూరిస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఇక దీనికి పునర్ నిర్వహణ సభ అని పేరు పెట్టి త్వరలోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు పథకాలు అమలు అయితే తెలంగాణలో పేదవారికి ప్రతినెల 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. అలాగే పేద మహిళలు 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొందగలరు. అయితే ప్రస్తుతం సబ్సిడీ గ్యాస్ 903 రూపాయలు ఉంది. ఇక దానికి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 403 అదనపు సబ్సిడీ పొందినట్లు ఉంటుంది.

 

అయితే ఈ రెండు పథకాలు ఇవ్వాలే ప్రకటిస్తానని ప్రభుత్వాధికారంగా చెప్పలేదు కానీ ఫిబ్రవరి నుంచి అమలు అవుతాయని ఇదివరకే సూచనప్యాయంగా చెప్పడం వలన ఇవాళ అమలు అవుతాయని ప్రచారం జరుగుతుంది. అభివృద్ధి పనులు ఇవాళ ఇంద్రవెల్లి మండలం కేస్లాపురం సీఎం రేవంత్ రెడ్డి నాగ పౌలు పూజ చేస్తారు. ఆ తరువాత ఆలయ గోపురాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేస్లాపూర్ లోని కేస్లాపూర్ ముత్నూర్ మధ్య 15 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మిస్తున్నారు. దానికోసం భూమి పూజ చేస్తారు. ఆ తరువాత నాగుబా ఆలయం దగ్గర ఆదివాసులు పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడతారు

. తర్వాత అక్కడ నిర్మించిన ప్రహరీ గోడలు ప్రారంభిస్తారు. కేస్లాపూర్ లో నిర్మించిన గిరిజన బాలికల గురుకుల పక్క భవనాన్ని నిర్మాణం కోసం భూమి పూజ చేస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఇంద్రవెల్లికి హెలికాప్టర్ లో వెళ్తారు. ఇందుకోసం 12 గంటల 30 నిమిషాలకు బేగం పేట ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడ నుంచి ఇంద్రవెల్లి కి వెళ్తారు. ఆ తర్వాత కేస్లాపూర్ కి వెళ్లి నాగుబా ఆలయాన్ని సందర్శిస్తారు. పూజ అనంతరం తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. కొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహిళలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం దగ్గర ఏర్పాటుచేసిన సభకు వెళ్లి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నట్టు సమాచారం.