Free Bus : ఉచిత బస్సులను తక్షణమే రద్దు చేయాలి…ఆటో కార్మికుల ఆందోళన…

Free Bus : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిచేసే విధంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. దానిలో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అయితే ఎన్నికల ప్రచార సమయంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ సర్కార్ వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన […]

  • Published On:
Free Bus : ఉచిత బస్సులను తక్షణమే రద్దు చేయాలి…ఆటో కార్మికుల ఆందోళన…

Free Bus : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిచేసే విధంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. దానిలో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అయితే ఎన్నికల ప్రచార సమయంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ సర్కార్ వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్ ప్రయాణాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆమోదించడం జరిగింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగానే ఉంది కానీ ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులందరూ భారీగా నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. మహాలక్ష్మి పథకంలోనే ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో డ్రైవర్ల యూనియన్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలియజేశారు.

Free buses should be canceled immediately...auto workers' concern...

ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న మహిళలకు ఉచిత బుస్ సౌకర్యాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు నిరసనలు చేపట్టారు. అలా చేయకుంటే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని…అదేవిధంగా ప్రతి నెల ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వాలని…అలాగే ఐదు లక్షలు జీవిత బీమా కూడా కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. ఒకవేళ తమ డిమాండ్లను పరిష్కరించినట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని ఆటో డ్రైవర్ల యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి దీనిని కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.