Free Bus Effect : కొంపముంచిన ఫ్రీ బస్సు ప్రయాణం…కరీంనగర్ బస్సు ఎక్కి సికింద్రాబాద్ లో ప్రత్యక్షమైన బాలిక….

Free Bus Effect  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పేద మరియు మధ్యతరగతి వర్గాలకు మంచి వెన్నుదన్ను అని చెప్పాలి కానీ ఉచిత ప్రయాణాలు వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులకు ఊహించని విధంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎదురైంది సమస్య కాదు కానీ ఓ ప్యాసింజర్ తెలియక చేసిన పొరపాటు. ఇంతకీ […]

  • Published On:
Free Bus Effect : కొంపముంచిన ఫ్రీ బస్సు ప్రయాణం…కరీంనగర్ బస్సు ఎక్కి సికింద్రాబాద్ లో ప్రత్యక్షమైన బాలిక….

Free Bus Effect  : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పేద మరియు మధ్యతరగతి వర్గాలకు మంచి వెన్నుదన్ను అని చెప్పాలి కానీ ఉచిత ప్రయాణాలు వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులకు ఊహించని విధంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎదురైంది సమస్య కాదు కానీ ఓ ప్యాసింజర్ తెలియక చేసిన పొరపాటు. ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే. …కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల వయసున్న ఆయన కన్నబిడ్డ వశిష్టకు క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల సెలవులు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సందర్భంగా ఆ పాప తన అమ్మమ్మ ఊరు పెద్దపల్లి కి వెళ్ళాయని నిర్ణయించుకుంది. అమ్మమ్మ ఊరికి వెళ్ళిన ఆ పాప రెండు రోజులు సరదాగా అక్కడ గడిపింది.

అనంతరం మూడవ రోజు ఆ పాపను ఆమె తాతయ్య కరీంనగర్ బస్సు ఎక్కించడం జరిగింది. అలాగే అల్లుడికి పాప వస్తున్నట్లుగా ఫోన్ చేసి చెప్పాడు. పాపను కరీంనగర్ లో రిసీవ్ చేసుకోవాల్సిందిగా తెలియజేశాడు. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఆ పాప ఎక్కిన బస్సు జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో లోపల ఉన్న ప్రయాణికులకు ఏ ఊరు వస్తుందో ఏ ఊరు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బస్సు చివర్లో ఉన్న వారికి మధ్యలో ఉన్నవారికి కండక్టర్ అరచి చెప్పిన వినపడని పరిస్థితి. అయితే బస్సులో చోటు చేసుకున్న ఈ పరిణామాలే పాపకు తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. సాఫీగా తాగాల్సిన పాప ప్రయాణం సమస్యల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ లో దిగాల్సిన వశిష్ట పొరపాటున వేరే ప్రదేశంలో దిగేసింది. ఇక పాప కోసం కరీంనగర్ లో వెయిట్ చేస్తున్న తండ్రికి ఆమె అందులో లేకపోవడంతో తన మామగారికి ఫోన్ చేశాడు. అయితే పాపను ఆయన చెప్పినట్లుగానే అదే బస్సులో పంపించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మొత్తానికి ఆ పాప ఎక్కడుందనేది మిస్టరీగా మారిపోయింది.

ఇక పాప వద్ద ఫోన్ కూడా లేకపోవడం మరింత సమస్యగా మారింది. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే కరీంనగర్ చేరేందుకు ఏ బస్సు ఎక్కిందో, ఎక్కడకని చెప్పిందో, ఇక బస్సులో ఉన్న ఆ హడావిడలో కండక్టర్ ఎక్కడికని జీరో టికెట్ కొట్టాడో కానీ ఆ పాప శుక్రవారం సికింద్రాబాద్ బస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. తల్లిదండ్రులతో తప్ప ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయని ఆ బాలిక అయోమయంలో ఒక చోట దిగాల్సింది మరోచోట దిగడం … ఇక ఫ్రీ బస్ ప్రయాణం కావడంతో తోచిన వైపు బస్సు ఎక్కి ప్రయాణం చేయడం తో సికింద్రాబాద్ వరకు వచ్చి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తానికి పాప ఆచూకీ లభించడంతో అటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనతో ఆర్టీసీకి ఏ సంబంధం లేదు కానీ ఉన్న సమస్యలకు ఇది ఒక కొత్త రకమైన సమస్య అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి సమస్యలను ముందు ముందు ఎన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.