Kavitha : ముందు రేవంత్ పై కేసు పెట్టండి… కవిత స్ట్రాంగ్ వార్నింగ్…
Kavitha : మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఆరోపించినందుకుగాను వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే వెంటనే కోర్టులను ఆశ్రయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కవిత పేర్కొంటూ తెలంగాణ డిజిపిని ట్యాగ్ చేశారు. అలాగే సూర్యుడిపై ఉమ్ము వేస్తే అది తిరిగి మన మీదనే […]
Kavitha : మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఆరోపించినందుకుగాను వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే వెంటనే కోర్టులను ఆశ్రయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కవిత పేర్కొంటూ తెలంగాణ డిజిపిని ట్యాగ్ చేశారు. అలాగే సూర్యుడిపై ఉమ్ము వేస్తే అది తిరిగి మన మీదనే పడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు అంటూ రేవంత్ కు గుర్తు చేశారు.
అయితే కవిత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు. దళిత బిడ్డ అయినటువంటి సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలను ఈనాడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంబిస్తుంది అంటూ ఆమె రాసుకొచ్చారు. ఇది రాచరిక వ్యవస్థను తలపిస్తుందని కవిత పేర్కొన్నారు.
అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనూహ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డ బాల్క సుమన్ .. చెప్పుతో కొడతాను అంటూ కామెంట్ చేయడం జరిగింది. దీంతో సుమన్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అసభ్య పదజాలాన్ని ఉపయోగించి రేవంత్ రెడ్డి ముందుగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి పై ముందు కేసు పెట్టండి అంటూ కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024