Viral News : పండుగ వేల విషాదం…బతుకమ్మ మెట్లను శుభ్రం చేస్తూ సఫాయి కార్మికులు మృతి…

Viral News : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం లో బతుకమ్మ పండుగ వేల ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంటే ఎలా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా తీగుల్ గ్రామ ప్రజలు కూడా బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో బతుకమ్మలను నిమర్జనం చేసే చెరువు కట్ట వద్ద భారీ సంఖ్యలో పిచ్చి చెట్లు […]

  • Published On:
Viral News : పండుగ వేల విషాదం…బతుకమ్మ మెట్లను శుభ్రం చేస్తూ సఫాయి కార్మికులు మృతి…

Viral News : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం లో బతుకమ్మ పండుగ వేల ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంటే ఎలా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా తీగుల్ గ్రామ ప్రజలు కూడా బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో బతుకమ్మలను నిమర్జనం చేసే చెరువు కట్ట వద్ద భారీ సంఖ్యలో పిచ్చి చెట్లు మొలవడం జరిగింది. ఇక వాటిని తొలగించి బతుకమ్మ నిమజ్జనానికి ఘాట్ ను సిద్ధం చేసేందుకు గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు పునుకున్నారు.  ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ గ్రామానికి చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

తీగుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసే సఫాయి కార్మికులు కర్రెమల్ల బాబు ( 25 ) , గిరిపల్లి భారతి ( 40 ) , ఎల్లం యాదమ్మ ( 43 ) ఘాట్ వద్ద మెట్లను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారీ చెరువులో పడి గల్లంతయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ మరియు గ్రామస్తులందరూ చెరువు దగ్గరికి చేరుకున్నారు. ఇక ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ స్థానిక పోలీసులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ళ సహాయంతో గల్లంతైన ముగ్గురు శవాలను వెలికి తీశారు. ఈ ఘటనతో తెగుల్ గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి.