Congress False Schemes : లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ నేతలు…

Congress False Schemes : తెలంగాణ ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్న ఈ పార్టీ ఫేక్ రాజకీయంలో మరో ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఓట్ల వేటు లో విన్యాసాలు చేయబోయి పప్పులో కాలేసింది. లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేసుకునే సందర్భంలో అడ్డంగా దొరికిపోయింది. అయితే ఆరు నెలల అద్భుత సాధన పేరుతో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలోని తెలుగు పత్రికలకు భారీ ప్రకటన […]

  • Published On:
  Congress False Schemes : లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ నేతలు…

Congress False Schemes : తెలంగాణ ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్న ఈ పార్టీ ఫేక్ రాజకీయంలో మరో ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఓట్ల వేటు లో విన్యాసాలు చేయబోయి పప్పులో కాలేసింది. లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేసుకునే సందర్భంలో అడ్డంగా దొరికిపోయింది. అయితే ఆరు నెలల అద్భుత సాధన పేరుతో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలోని తెలుగు పత్రికలకు భారీ ప్రకటన ఇచ్చింది. ఇక ఈ ప్రకటనలో తాము 6 గ్యారెంటీలను నెరవేర్చామని చెప్పటం ఈ యాడ్ కి ముఖ్య కారణం. అయితే ఆ ప్రకటనలో ఓ విద్యార్థి ఫోటోను వాడడం జరిగింది. ఆ విద్యార్థి యువనిది కింద తనకు 3000 రూపాయలు అందుతున్నాయని చెబుతున్నట్లుగా ప్రకటన జారీ చేశారు.

 

అయితే వాస్తవానికి ఆ విద్యార్థి ఫోటో ఒక వెబ్సైట్ కి చెందినదిగా తేలింది. కర్ణాటక ప్రకటనలో పేర్కొన్న యువకుని చిత్రాన్ని పరిశీలించినట్లయితే practicewitheve అనే వెబ్సైట్ నుండి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ విద్యార్థులకు సామర్థ్యాన్ని పెంచే ఆన్లైన్ వెబ్సైట్ అది. భవిష్యత్తులో ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు ఈ వెబ్సైట్ సహాయపడుతుంది. వారానికి రెండు కేసులు ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్ చేపిస్తారు. అలాంటి వెబ్సైట్ నుండి ఊరు పేరు లేని విద్యార్థి ఫోటోను తీసుకొని ఆ విద్యార్థికి సి కే మహేష్ అని పేరు పెట్టింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రాడ్యుయేట్ విద్యార్థిగా పేర్కొని తప్పుడు ప్రకటనలు చేస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నేటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి కాంగ్రెస్ గుట్టు రట్టు చేశారు. ఓట్ల కోసం ఇలాంటి ఫేక్ ప్రకటనలు ప్రచారం చేస్తున్నారని హస్తం పార్టీని ఆడుకుంటున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని దృవీకరించలేదు.