CM Revanth Reddy : పురుషులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి…

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే మహిళలకు అందిస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సులో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. వీరితో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సులలో రద్దీ కారణంగా గొడవలు జరుగుతున్న సంఘటనలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలని […]

  • Published On:
CM Revanth Reddy : పురుషులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి…

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే మహిళలకు అందిస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సులో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. వీరితో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సులలో రద్దీ కారణంగా గొడవలు జరుగుతున్న సంఘటనలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ వస్తుంది. అయితే తొలిసారిగా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాదు లో పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును గురువారం ప్రారంభించారు. రద్దీ సమయంలో ఆర్టిసి ఉపయోగించే యువకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ని ప్రారంభించింది.

కాలేజీకి వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం టు ఎల్బీనగర్ రోడ్ లో మొదటి పురుషుల సేవల బస్సు ను ప్రారంభించారు. ఈ మార్గంలో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీ లు ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి బస్సు 8:30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం చివరగా 4:30 నిమిషాలకు తిరిగి అదే మార్గంలో వెళుతుంది. ఇది ఇలా ఉంటే తెలంగాణలోని మహిళలకు ఉచిత ప్రయాణం పథకం తీసుకు వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. పథకం ప్రారంభమైన తర్వాత హైదరాబాదులో సుమారు 31 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక రోజు వారి ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్న మహిళల శాతం 51 శాతం నుంచి 82 శాతానికి పెరిగిందని ఒక సర్వేలో తేలింది.