BJP MLA Raja Singh : రేవంత్ రెడ్డి ఆరు నెలలు మాత్రమే సీఎం…

BJP MLA Raja Singh  : బిజెపి కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, భాషా తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ…దేశంలో అన్ని వర్గాల ప్రజలు గర్వంగా జీవిస్తున్నారు అన్న న్యాయం జరుగుతుంది అన్న ముఖ్య కారణం అంబేద్కర్ అని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనను స్మరించుకుంటారు అని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై […]

  • Published On:
BJP MLA Raja Singh : రేవంత్ రెడ్డి ఆరు నెలలు మాత్రమే సీఎం…

BJP MLA Raja Singh  : బిజెపి కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, భాషా తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ…దేశంలో అన్ని వర్గాల ప్రజలు గర్వంగా జీవిస్తున్నారు అన్న న్యాయం జరుగుతుంది అన్న ముఖ్య కారణం అంబేద్కర్ అని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనను స్మరించుకుంటారు అని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ విమర్శలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రావణ రాజ్యము అంతమైందని అన్నారు.

కెసిఆర్ రావణుడు తెలంగాణ ప్రజలను మోసం చేశాడని , ఎస్సీలను కేసీఆర్ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడని, అలాగే దళితులందరికీ దళిత బంధు ఇవ్వలేదని , అలాగే అంబేద్కర్ కు ఎప్పుడు నివాళులు అర్పించలేదని రాజాసింగ్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ బిజెపితోనే జరిగిందని పేర్కొన్నారు. ఇక దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇలాగే చేస్తే బిజెపి కార్యకర్తలు మిమ్మల్ని వదిలిపెట్టరని తెలియజేశారు. అలాగే అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ తెలియచేసింది నరేంద్ర మోడీ అంటూ పేర్కొన్నారు.‌

అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఉండదని , ఆరు నెలలకి లేదా ఏడాదికి ఒకసారి సీఎంని మారుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కచ్చితంగా విఫలమవుతుందని వారు అందించిన హామీలు ఏవి కూడా సరైనవి కాదని ఆయన తెలియజేశారు.6 గ్యారెంటీల పేరుతో మోసపూరిత హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేశారు. అందుకే ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తర్వాత బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.