CM KCR : కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోకం… తప్పిన పెను ప్రమాదం…
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇటీవల పెను ప్రమాదం తప్పింది. కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోకం ఏర్పడింది. ఎలక్షన్ మీటింగ్ లో భాగంగా నిన్న మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ఎర్రవల్లి నుంచి బయలుదేరడం జరిగింది. ఇక మార్గమధ్యంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ హెలికాప్టర్ ను అదుపు చేసి […]
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇటీవల పెను ప్రమాదం తప్పింది. కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోకం ఏర్పడింది. ఎలక్షన్ మీటింగ్ లో భాగంగా నిన్న మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ఎర్రవల్లి నుంచి బయలుదేరడం జరిగింది. ఇక మార్గమధ్యంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ హెలికాప్టర్ ను అదుపు చేసి తిరిగి మళ్లీ ఎర్రవల్లి లోనే ల్యాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరో ప్రత్యంనాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేసింది. దీంతో సీఎం కేసీఆర్ ఆ హెలికాప్టర్ ద్వారా దేవరకద్ర బహిరంగ సభకు వెళ్లడం జరిగింది.
అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లోని చాలా నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ పర్యటించారు. బహిరంగ సభల్లో పాల్గొంటూ తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అందించిన పథకాలను వివరిస్తూ వస్తున్నారు. అయితే నిన్న మహబూబ్ నగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగించారు. ముందుగా దేవరకద్ర చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి బహిరంగ సభలో పాల్గొని అక్కడినుండి ఇతర నియోజకవర్గాలకు పయనం అయ్యారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ బహిరంగ సభలను చేరుకునేందుకు హెలికాప్టర్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే పెను ప్రమాదం నుంచి సీఎం కేసీఆర్ బయటపడ్డారు.