Madhapur Suspicious Death : హైదరాబాదులో దారుణం…ఓయో రూమ్ లో అనుమానస్పద రీతిలో చనిపోయిన యువతి…

Madhapur Suspicious Death  : అనుమానాస్పద రీతిలో యువతి చనిపోయిన ఘటన హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రోజు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే పాండిచెర్రీకి చెందిన శర్వణప్రియ  ( 25 ) ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగిగా పని చేసుకుంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు చెన్నైకు చెందిన వ్యాపారి ప్రియ […]

  • Published On:
Madhapur Suspicious Death : హైదరాబాదులో దారుణం…ఓయో రూమ్ లో అనుమానస్పద రీతిలో చనిపోయిన యువతి…

Madhapur Suspicious Death  : అనుమానాస్పద రీతిలో యువతి చనిపోయిన ఘటన హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రోజు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే పాండిచెర్రీకి చెందిన శర్వణప్రియ  ( 25 ) ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగిగా పని చేసుకుంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు చెన్నైకు చెందిన వ్యాపారి ప్రియ స్నేహితుడు శ్రీహరి రమేష్ ప్రియా ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో శ్రీహరితో ప్రియకు స్నేహం ఉన్నట్టు సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి మాదాపూర్ లోని చందా నాయక్ తండాలో ని గోల్డెన్ హైవ్ ఓయో లో 308 రూమ్ ను బుక్ చేసుకున్నారు.

atrocious-in-hyderabad-young-woman-died-in-suspicious-manner-in-oyo-room

ఇక అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మరుసటి రోజు తెల్లవారుజామున శ్రీహరికి వాంతులు అవడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు . చికిత్స అనంతరం ఓయ రూమ్ కి వచ్చిన శ్రీహరి రమేష్ ప్రియ కుర్చీలో నిర్మానుష్యంగా పడి ఉండడం చూసి అంబులెన్స్ కి కాల్ చేశాడు. ఇక ఓయో సహాయక సిబ్బంది సహాయంతో ఆమెను అంబులెన్స్ లోకి చేర్చగా అప్పటికే ప్రియా చనిపోయినట్లుగా అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. ఇక ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకుని యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

atrocious-in-hyderabad-young-woman-died-in-suspicious-manner-in-oyo-room

అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈనెల 11వ తేదీ ఉదయం 10.49 నిమిషాలకు రూమ్ నుంచి యువతి ఫోన్ చేసి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని చెప్పిందట. ఇక తర్వాత ఆమెకు ఆకలి వేయడంతో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగా తెలిసింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన శ్రీహరి ప్రియ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది.