IND vs NZ Semi Final : వరల్డ్ కప్ సెమిస్…ఇండియా వర్సెస్ న్యూజిలాండ్…గెలుపు ఎవరిది..?

IND vs NZ Semi Final : ప్రపంచ కప్ లో భాగంగా వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఈరోజు న్యూజిలాండ్ తో సెమిస్ లో తలపడనుంది. ఇక ఈ ప్రపంచకప్ ను అందుకోవాలంటే అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ పోరాటంలో గెలుపు ఎవరిది అనేది ఎవరు ఊహించలేం. ఇక ఇప్పుడు ఇదే తరహాలో టీమిండియా కూడా చాలా గట్టి పోటీ ఇస్తూ సెమీస్ కు అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్ […]

  • Published On:
IND vs NZ Semi Final : వరల్డ్ కప్ సెమిస్…ఇండియా వర్సెస్ న్యూజిలాండ్…గెలుపు ఎవరిది..?

IND vs NZ Semi Final : ప్రపంచ కప్ లో భాగంగా వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఈరోజు న్యూజిలాండ్ తో సెమిస్ లో తలపడనుంది. ఇక ఈ ప్రపంచకప్ ను అందుకోవాలంటే అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ పోరాటంలో గెలుపు ఎవరిది అనేది ఎవరు ఊహించలేం. ఇక ఇప్పుడు ఇదే తరహాలో టీమిండియా కూడా చాలా గట్టి పోటీ ఇస్తూ సెమీస్ కు అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్ లో రెండు భారీ టీంలు పెద్ద ఎత్తున ఢీకొనబోతున్నాయి. అయితే భారత్ టీం కి మాత్రం చాలా రకాల భయాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే గత వరల్డ్ కప్ 2019లో జరిగిన సంఘటన మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆందోళనలో భారత క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇక ఇది అందరినీ కలవర పెడుతుంది. అంతేకాక గత వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా తడపడుతూ వచ్చింది. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ టీం పై ఇండియన్ టీం నాకౌట్ మ్యాచ్లో తలపడి వెనుదిరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి.

world-cup-semis-india-vs-new-zealand-who-will-win

ఈ క్రమంలోని ఈరోజు జరగబోయే న్యూజిలాండ్ భారత్ మధ్య మ్యాచ్లో మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అంటూ అభిమానులు కలవర పడుతున్నారు. అయితే ఇంతకుముందు న్యూజిలాండ్ పై భారత్ మూడుసార్లు తలపడింది. ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ పై భారీ ఓటమి చవిచూసింది. ఇక ఆ పరాజయాన్ని ఇండియన్ టీం తో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత 2021 సంవత్సరంలో డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే 2019 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు చేరుకున్న భారత్ 18 పరుగులు తేడాతో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయింది. ఇక వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం భారత టీం పరిస్థితి ఏంటి అనే అభిప్రాయాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి.

world-cup-semis-india-vs-new-zealand-who-will-win

ఈ క్రమంలోనే కొందరు ఇండియా మ్యాచ్ గెలవడం కష్టమే అంటూ ఉంటే మరి కొందరు న్యూజిలాండ్ టీమ్ ను ఈసారి భారత్ టీమ్ చిత్తు చేస్తుందంటూ తెలియజేస్తున్నారు. దీంతో ఈ విషయంపై గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక న్యూజిలాండ్ టీం కూడా ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఫామ్ చూసి కాస్త భయపడుతున్నారని చెప్పాలి. ఇప్పటివరకు ప్రపంచ కప్ లో ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా వచ్చింది. అంతేకాక లీగ్ దశలోనే టీమిండియా చేతిలో న్యూజిలాండ్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అలాగే ఇప్పటివరకు వరల్డ్ కప్ హిస్టరీ లో 9 సార్లు సెమీఫైనల్ కి చేరిన టీమ్ గా న్యూజిలాండ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే అన్నిసార్లు సెమీఫైనల్ కి వచ్చినప్పటికీ ఇప్పటివరకు న్యూజిలాండ్ టీం కు ఒక కప్పు కూడా రాకపోవడం గమనార్హం. మరి ఈరోజు నవంబర్ 15న జరగబోయే భీకర పోరు లో ఎవరు ఆధిపత్యం వహిస్తారు వేచి చూడాల్సిందే.