ODI World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ….

ODI World Cup Final  : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికి ఒక పాప పుట్టగా అనుష్క శర్మ మరోసారి గర్భం దాల్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఇటీవల జరిగిన ఇండియా మరియు న్యూజిలాండ్ మ్యాచ్లో అనుష్క శర్మ బేబీ బంప్ కనిపించడంతో ఈ వార్తలు వాస్తవాలని స్పష్టంగా అర్థమైంది. అయితే క్రికెట్ మ్యాచ్ జరిగే సందర్భాల లో కచ్చితంగా అనుష్క […]

  • Published On:
ODI World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ….

ODI World Cup Final  : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికి ఒక పాప పుట్టగా అనుష్క శర్మ మరోసారి గర్భం దాల్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఇటీవల జరిగిన ఇండియా మరియు న్యూజిలాండ్ మ్యాచ్లో అనుష్క శర్మ బేబీ బంప్ కనిపించడంతో ఈ వార్తలు వాస్తవాలని స్పష్టంగా అర్థమైంది. అయితే క్రికెట్ మ్యాచ్ జరిగే సందర్భాల లో కచ్చితంగా అనుష్క శర్మ పాల్గొని భర్త విరాట్ కోహ్లీని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మొన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా అనుష్క శర్మ గ్రౌండ్ కు చేరుకొని విరాట్ కోహ్లీని ఎంకరేజ్ చేసింది.

virat-kohlis-wife-anushka-sharma-arrived-in-ahmedabad-to-watch-the-world-cup-final-match

అయితే ఈరోజు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అనుష్క శర్మ గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంకి చేరుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గమనించినట్లయితే అనుష్క శర్మతో పాటు తన కుమార్తె వామికా కోహ్లీ కూడా అహ్మదాబాద్ స్టేడియం కి చేరుకుంది. ఈ వీడియో గమనించినట్లయితే ముందుగా వామికా కోహ్లీ బయటకు రాగా ఆ తర్వాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుండి తెల్లటి దుస్తులతో బయటకు వచ్చారు.

ఇక ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోని షేర్ చేస్తూ ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ తన కుమార్తె వామికాతో కలిసి అహ్మదాబాద్ చేరుకున్నారని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.