Viral Video : వరల్డ్ కప్ లో వాయుసేన చేయబోయే విన్యాసాలు…గూస్ బంప్స్ తెప్పిస్తున్న రిహాసల్స్ వీడియో…

Viral Video  : ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ పోరుకిఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు ఓటమనేది తెలియని టీమిండియా రేపు ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కోబోతుందనే అంశం తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ చారిత్రాత్మక పోరు ప్రారంభానికి భారతదేశానికి చెందిన వాయుసేన గగన విన్యాసాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. వీక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీమ్ ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే […]

  • Published On:
Viral Video : వరల్డ్ కప్ లో వాయుసేన చేయబోయే విన్యాసాలు…గూస్ బంప్స్ తెప్పిస్తున్న రిహాసల్స్ వీడియో…

Viral Video  : ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ పోరుకిఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు ఓటమనేది తెలియని టీమిండియా రేపు ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కోబోతుందనే అంశం తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ చారిత్రాత్మక పోరు ప్రారంభానికి భారతదేశానికి చెందిన వాయుసేన గగన విన్యాసాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. వీక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీమ్ ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రిహాసల్స్ ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని గమనించినట్లయితే మ్యాచ్ ప్రారంభోత్సవం అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతుంది.

Viral: వరల్డ్ కప్‌లో కనిపించబోయే సీన్.. గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ఆనంద్  మహీంద్రా వీడియో! | Anand Mahindra shares rehearls video of airforce opening  ceremony of the world cup final ind ...

అయితే రేపు స్టేడియంలో జరగబోయే వాయుసేన విన్యాసాలకు సంబంధించిన రిహార్సల్స్ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇక ఈ వీడియోలో స్టేడియాన్ని వివిధ రంగులతో అంత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బ్యాక్ గ్రౌండ్ లో జాతీయగీతం వినిపిస్తుండగా వాయిసేనకు చెందిన విమానాలు నిర్దిష్ట పద్ధతిలో పొగను చిమ్ముతు దూసుకుపోయాయి. ఈ అద్భుతం చూడడానికి కనుల విందుగా ఉంది. ఇక ఈ వీడియోను ఆనంద్ మహేంద్రా షేర్ చేస్తూ…నా ఫ్రెండ్ ఈ వీడియో తీశాడు. దీనిలో వాయుసేన గగన విన్యాసాలను చూడవచ్చు. ఈ విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటూ ఆనంద్ మహేంద్ర రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.