Suryakumar Yadav : భారత్ కెప్టెన్ గా సూర్య కుమార్…

Suryakumar Yadav : నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా తో జరగబోయే 5 మ్యాచ్ ల టి20 సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఎంపికైనట్లుగా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో సూర్య కుమార్ యాదవ్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఈ సిరీస్ కు భారత మాజీ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ గారు ప్రధాన […]

  • Published On:
Suryakumar Yadav : భారత్ కెప్టెన్ గా సూర్య కుమార్…

Suryakumar Yadav : నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా తో జరగబోయే 5 మ్యాచ్ ల టి20 సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఎంపికైనట్లుగా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో సూర్య కుమార్ యాదవ్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఈ సిరీస్ కు భారత మాజీ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ గారు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

surya-kumar-as-indias-captain

అయితే సోమవారం రోజు అహ్మదాబాద్ లో సమావేశాలు జరిపిన సెలెక్టర్లు మొదట ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా నియమించాలని భావించారట. అయితే అతనికి ఎక్కువ భారం కాకూడదన్న కారణంతో సూర్య కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ సిరీస్ కు సంబంధించి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అంటూ క్రిక్ బుజ్ నుండి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇకపోతే జూన్ లో జస్ప్రిత్ బూమ్రా నాయకత్వంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళిన యువ జంటను కొనసాగించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.