SriLanka : టీమిండియా తో సిరీస్ ను ప్రకటించిన శ్రీలంక…ప్రారంభం ఎప్పుడంటే…

SriLanka  : శ్రీలంకకు తిరిగి పాత రోజులు వచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం వరుసగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు శ్రీలంక సిద్ధమైంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో ప్రభుత్వం జోక్యం కారణంగా ఐసిసి శ్రీలంక జట్టును అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిషేధాన్ని తొలగించినట్లుగా ఐసీసీ ప్రకటించి లంక క్రికెట్ టీంకు అవకాశం కల్పించింది. దీంతో లంక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ ని కూడా ఆడుకోవచ్చు. […]

  • Published On:
SriLanka : టీమిండియా తో సిరీస్ ను ప్రకటించిన శ్రీలంక…ప్రారంభం ఎప్పుడంటే…

SriLanka  : శ్రీలంకకు తిరిగి పాత రోజులు వచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం వరుసగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు శ్రీలంక సిద్ధమైంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో ప్రభుత్వం జోక్యం కారణంగా ఐసిసి శ్రీలంక జట్టును అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిషేధాన్ని తొలగించినట్లుగా ఐసీసీ ప్రకటించి లంక క్రికెట్ టీంకు అవకాశం కల్పించింది. దీంతో లంక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ ని కూడా ఆడుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక భారత్ తో సిరీస్ ను సెట్ చేసుకుంది.

sri-lanka-has-announced-the-series-with-team-india-when-will-it-start

2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత జూలై నెలలో భారత క్రికెట్ జట్టుతో శ్రీలంక పర్యటించనుంది. దీనిలో భాగంగానే మూడు వన్డే మ్యాచ్ ల తో పాటు 3 t20 మ్యాచ్ లు కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. 2024 సంబంధించి షెడ్యూల్ మొత్తాన్ని ఆదేశ క్రికెట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగానే వచ్చే సంవత్సరం శ్రీలంక మొత్తం పది టెస్టులు ,21 వన్డేల తో పాటు ,21 t20 మ్యాచ్ లు అడనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 51 అంతర్జాతీయ మ్యాచులు శ్రీలంక ఆడనుంది.

అలాగే శ్రీలంక 2024 అంతర్జాతీయ క్రికెట్ ను జనవరిలో జింబాబ్వే తో ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే 300 తో పాటు మూడు టీ20 మ్యాచ్ లు కూడా ఆడనున్నారు. అనంతరం ఫిబ్రవరిలో ఆహ్వానిస్తూ ఒక టెస్ట్ మ్యాచ్ ,3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడనున్నారు. అయితే ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా అయితే ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతుండగా ఇది ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా పర్యటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్… ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ , ఐపీఎల్ టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో పర్యటించనున్నారు.