IND- NZ : రోహిత్ – కోహ్లీ మద్య వాగ్వాదం…అసలేం జరిగిందంటే…?

IND- NZ : ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 95 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఈ మ్యాచ్ ఆఖరి నిమిషం వరకు కూడా చాలా హోరాహోరీగా సాగింది. అంతేకాక న్యూజిలాండ్ తో భారత్ కి ఇది రివెంజ్ మ్యాచ్ అని కూడా చెప్పవచ్చు. అయితే […]

  • Published On:
IND- NZ : రోహిత్ – కోహ్లీ మద్య వాగ్వాదం…అసలేం జరిగిందంటే…?

IND- NZ : ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 95 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఈ మ్యాచ్ ఆఖరి నిమిషం వరకు కూడా చాలా హోరాహోరీగా సాగింది. అంతేకాక న్యూజిలాండ్ తో భారత్ కి ఇది రివెంజ్ మ్యాచ్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో అంతా బానే ఉన్నప్పటికీ ఎన్నడు చూడని ఘటన జరగటం గమనార్హం. అదే కోహ్లీ మరియు రోహిత్ కి మ్యాచ్ మధ్యలో వాగ్వాదం. అయితే తాజాగా దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది.

rohit-kohlis-altercation-what-actually-happened

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు 19 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టులో ఫామ్ లో ఉన్న దేవాన్ కాన్వే ( 0 ) , మరియు విల్ యంగ్ ( 17 ) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇక అప్పటికి కివీస్ స్కోర్ 19/2 మాత్రమే. అనంతరం గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన రచిన్ రవీంద్ర ( 75 ) ,డారీ మిచెల్ 130 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా మూడో వికెట్ కోల్పోయే సమయానికి 159 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ భారీ కోర్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే వీరిని అవుట్ చేసేందుకు రోహిత్ ఎన్ని వ్యూహాలు వేసినప్పటికీ ఫలించలేదు.

rohit-kohlis-altercation-what-actually-happened

భారత బౌలర్లు ఎంత ప్రయత్నించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ఆ సమయంలోనే కోహ్లీ రోహిత్ వద్దకు వెళ్లి సలహాలు ఇవ్వడం జరిగింది. ఫీల్డింగ్ సెట్ గురించి కోహ్లీ రోహిత్ తో ఏదో మాట్లాడాడు. రోహిత్ కూడా నేను అలాగే చేస్తున్న అన్నట్లుగా సమాధానం ఇచ్చినట్లు వీడియో లో అర్థం అవుతుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో కోహ్లీ మరియు రోహిత్ మాట్లాడుకునే తీరు కాస్త అగ్రెసివ్ గా అనిపించడంతో ఈ వీడియోను క్రికెట్ కౌన్సిల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కానీ అక్కడ గొడవ అనేది ఏం జరగలేదని వికెట్లు పడకపోవడం తో విరాట్ రోహిత్ కి కొన్ని సలహాలు, ఇచ్చాడని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 273 పరుగులు చేయగా భారత్ బాటర్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ కు విజయాన్ని అందించారు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)