Rohit Sharma : కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై…కొత్త కెప్టెన్సీ రేసులో ఐదుగురు…

Rohit Sharma  : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే తదుపరి వరల్డ్ కప్ టోర్నీ 2027 లో జరగనుంది.అయితే ప్రస్తుతం టీమిండియా కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ 2027 నాటికి ఫిట్ గా ఉంటాడా లేదా అనే నేపథ్యంలో 2027 వండే వరల్డ్ కప్ కొత్త కెప్టెన్ సిద్ధం చేయాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం భారత […]

  • Published On:
Rohit Sharma : కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై…కొత్త కెప్టెన్సీ రేసులో ఐదుగురు…

Rohit Sharma  : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే తదుపరి వరల్డ్ కప్ టోర్నీ 2027 లో జరగనుంది.అయితే ప్రస్తుతం టీమిండియా కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ 2027 నాటికి ఫిట్ గా ఉంటాడా లేదా అనే నేపథ్యంలో 2027 వండే వరల్డ్ కప్ కొత్త కెప్టెన్ సిద్ధం చేయాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ తప్పుకుంటే కెప్టెన్ రెస్ లో ఉండేది ఈ ఐదుగురు ప్లేయర్స్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కేఎల్ రాహుల్….

rohit-good-bye-to-captaincy-five-in-new-captaincy-race

బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ సామర్ధ్యాలతో కేఎల్ రాహుల్ ఇప్పుడు భారత జట్టుకు కీలకమైన ప్లేయర్ గా మారాడు. అంతేకాక ఇదివరకే పలుసార్లు భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం కేఎల్ రాహుల్ కి ఉంది. అయితే గత కొంతకాలంగా ఫోర్మ్ కోల్పోయిన కేఎల్ రాహుల్ ఆసియా కప్పులో తిరిగి పుంజుకున్నాడు. అప్పటినుండి రాహుల్ పర్ఫామెన్స్ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగలిగే బలమైన పోటీదారులలో కేఎల్ రాహుల్ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది.

శ్రేయస్ అయ్యర్…

rohit-good-bye-to-captaincy-five-in-new-captaincy-race

చాలా దూకుడుగా ఆటను కనబరిచే శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే టాప్ మిడిల్ ఆర్డర్ లో కీలక ప్లేయర్ గా మారాడు.అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్ గా మంచి ప్రదర్శన చేయడం, అలాగే మంచి కెప్టెన్సీ అనుభవం కలిగి ఉండడం ,అయ్యర్ కు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బీసీసీఐ శ్రేయస్ ను కెప్టెన్ గా చేసే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జస్ప్రీత్ బుమ్రా…

rohit-good-bye-to-captaincy-five-in-new-captaincy-race

భారత జట్టుకు బుమ్రా కీలకమైన ఆటగాడు మాత్రమే కాదు అత్యుత్తమ ఆటగాడు కూడా. అలాగే సుదీర్ఘ కాలంగా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడిగా కోనసాగుతున్నారు. అంతేకాక భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో జట్టుకు సారథ్యం కూడా వహించాడు. తన బౌలింగ్ తో జట్టును నడిపించగలిగే సామర్థ్యం బుమ్రా ను కెప్టెన్సీ రేస్ లోకి తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హార్దిక్ పాండ్యా…

rohit-good-bye-to-captaincy-five-in-new-captaincy-race

ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకునే హార్దిక్ పాండ్యా గతంలో టి20 భారత్ కెప్టెన్ గా నాయకత్వం వహించాడు. అలాగే రోహిత్ శర్మ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కోసం బీసీసీఐ చూసే ఆటగాళ్లలో హార్దిక్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే టి20 సిరీస్ లో అతని రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంకూడా లేదు. కానీ ప్రస్తుతం ఆల్ రౌండర్ వరుసగా గాయాలకు గురి కావడం కాస్త సమస్యగా మారిందని చెప్పాలి.

శుబ్ మన్ గిల్…

rohit-good-bye-to-captaincy-five-in-new-captaincy-race

భారత్ కు మాత్రమే కాకుండా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే శుబ్ మన్ గిల్ కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నారు. అంతేకాక చాలామంది క్రికెట్ నిపుణులు శుబ్ మాన్ గిల్ ను తదుపరి సచిన్ టెండుల్కర్ , విరాట్ కోహ్లీ అంటూ అభివర్ణించడం గమనార్హం. అతని అద్భుతమైన ప్రదర్శనతో ఇప్పటికే అభిమానులను కుడా సంపాదించుకున్నాడు. అంతేకాక ఇప్పటికే భారత జట్టులో మూడు ఫార్మేట్ల లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాగే భారతీయ ఏ జట్టును కూడా సమర్ధవంతంగా నడిపించిన అనుభవం అతనికి ఉంది. ఒకవేళ బీసీసీఐ దీర్ఘకాలిక ప్రాణాలిక చేసినట్లయితే ,గిల్ కు జట్టు కెప్టెన్ గా సుదీర్ఘ అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది.