World Cup 2023 : వరుసగా 6వ విజయం సాధించిన భారత్…సెమీస్ కు చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలి..?

World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల ఆదివారం రోజు లక్నోలోని ఎకాన స్టేడియం లో ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో 100 పరుగులు తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక ఈ భారీ గెలుపుతో పాయింట్ పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా విజయం సాధించడం వరుసగా ఇది ఆరోసారి. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్ని రౌండ్ […]

  • Published On:
World Cup 2023 : వరుసగా 6వ విజయం సాధించిన భారత్…సెమీస్ కు చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలి..?

World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల ఆదివారం రోజు లక్నోలోని ఎకాన స్టేడియం లో ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో 100 పరుగులు తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక ఈ భారీ గెలుపుతో పాయింట్ పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా విజయం సాధించడం వరుసగా ఇది ఆరోసారి. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్ని రౌండ్ రాబిన్ ఫార్మేట్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.

india-who-won-6th-consecutive-victory-how-many-more-wins-to-reach-the-semis

ఇక దీనిలో భాగంగా ఒక్కో జట్టు 9 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. ఇక దీనిలో నేరుగా సెమీఫైనల్స్ బెర్త్ సాధించాలంటే కనీసం 7 మ్యాచ్లు గెలివాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 6 సార్లు వరుస విజయాలను అందుకున్న భారత్ ,తదుపరి మ్యాచ్ శ్రీలంక దక్షిణాఫ్రికా ,నెదర్లాండ్ తో తలపడనుంది. ఇక ఈ మూడు మ్యాచ్లలో ఒక దాంట్లో విజయం సాధించినట్లయితే 7 విజయాలను అందుకున్న టీమిండియా ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరుతాయి. దీంతో టీమిండియా డైరెక్ట్ గా సెమీఫైనల్ లో చోటు దక్కించుకోవడం ఖాయం అవుతుంది.

india-who-won-6th-consecutive-victory-how-many-more-wins-to-reach-the-semis

ఇదిలా ఉంటే ఇప్పటివరకు టీం ఇండియా తప్ప మరే ఇతర జట్టు 12 పాయింట్లను దక్కించుకోలేదు. ఇక ఇతర జట్ల విషయానికొస్తే 6 మ్యాచ్ లు ఆడి 5 గెలిచిన దక్షిణాఫ్రికా 10 పాయింట్ల తో రెండవ స్థానంలో ఉంది. 6 మ్యాచ్లలో 4 విజయాలను సాధించిన న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉంది. అలాగే ఆస్ట్రేలియా 6 మ్యాచ్ లలో 4 గెలిచి 4వ స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది. దీనిలో భాగంగా 6 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా మరో విజయం సాధిస్తే తప్ప సెమీఫైనల్ లో స్థానం దక్కే అవకాశం ఉండదు.