World Cup 2023 : ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్…7 వికెట్లు తీసి చరిత్ర్ర సృష్టించిన మహమ్మద్ షమీ…
World Cup 2023 : భారత్ మరియు న్యూజిలాండ్ కు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత ఫేసర్ మహమ్మద్ షమీ సంచలన సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు . అంతేకాక వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున 7 వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా షమీ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇంతకుముందు 2003 వరల్డ్ కప్ లో ఆశీస్సు నెహ్ర సింగిల్ మ్యాచ్లో 6 వికెట్లు […]
World Cup 2023 : భారత్ మరియు న్యూజిలాండ్ కు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత ఫేసర్ మహమ్మద్ షమీ సంచలన సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు . అంతేకాక వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున 7 వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా షమీ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇంతకుముందు 2003 వరల్డ్ కప్ లో ఆశీస్సు నెహ్ర సింగిల్ మ్యాచ్లో 6 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించగా…ఇక ఇప్పుడు షమీ 7 వికెట్లు పడగొట్టి ఆ చరిత్రను తిరగరాశాడు.
ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓపెనర్లు బాగానే రాణించగా 6వ ఓవర్ వేసేందుకు వచ్చిన షమీ తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత 8వ ఓవర్ లో రచన్ రవీంద్ర వికెట్ కూడా తీశాడు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియంసన్ మరియు డేరీల్ మిచెల్ మాత్రం క్రేజ్ లోనే పాతుకుపోయారు . భారత్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీరు మాత్రం అవుట్ అవ్వలేదు. ఇలాంటి క్లిష్ట తరుణంలో మహమ్మద్ షమీ విలియమ్సన్ క్యాచ్ ని మిస్ చేశాడు. ఈ క్రమంలో షమీ పై ఆన్లైన్లో ట్రోల్స్ కూడా వచ్చాయి. మరోవైపు న్యూజిలాండ్ స్కోర్ భారీగా పెరుగుతుంది.
ఈ క్రమంలోనే భారత్ బౌలర్లకి కూడా ఒత్తిడి పెరిగింది. ఇక అదే సమయంలో షమీ ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎవరికి క్యాచ్ అయితే మిస్ చేశాడో వచ్చి వారి వికెట్లు తీసేసాడు. ఈ దెబ్బతో మ్యాచ్ మొత్తం టీమిండియా వైపు మళ్ళింది. కానీ మిచెల్ ఇంకా క్రేజ్ లో ఉండటం భారత బౌలర్లకి కాస్త తలనొప్పి పెట్టించింది. ఈ క్రమంలోనే తన ఐదవ వికెట్ గా షమి మిచెల్ ను అవుట్ చేయడం తో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ ఆకలి తీరని షమి 49వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసుకొని ఆల్ అవుట్ చేశాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా షమీ చరిత్ర సృష్టించాడు.