World Cup 2023 : వరుసగా మరో ఘనవిజయంం సాధించిన భారత్…రికార్డ్స్ బ్రేక్ చేసిన రవీంద్ర జడేజా ,విరాట్ కోహ్లీ…

World Cup 2023 : ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా మరియు భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే తొలత బ్యాటింగ్ కు బరిలో దిగిన భారత్ నిర్దేశిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ క్రమంలో చేజింగ్ చేసేందుకు 327 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకు గాను కేవలం 83 అడుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ […]

  • Published On:
World Cup 2023 : వరుసగా మరో ఘనవిజయంం సాధించిన భారత్…రికార్డ్స్ బ్రేక్ చేసిన రవీంద్ర జడేజా ,విరాట్ కోహ్లీ…

World Cup 2023 : ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా మరియు భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే తొలత బ్యాటింగ్ కు బరిలో దిగిన భారత్ నిర్దేశిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ క్రమంలో చేజింగ్ చేసేందుకు 327 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకు గాను కేవలం 83 అడుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ , బ్యాట్ మెన్స్ విరాట్ కోహ్లీ 101 పరుగులు చేసి 49 ఓడిఐ సెంచరీస్ తో సచిన్ టెండూల్కర్ రికార్డ్ కు సరిసమానం చేసి అదరగొట్టాడు.

India beats South Africa, remains unbeaten in Cricket World Cup. Fans react | Trending - Hindustan Times

అనంతరం శ్రేయస్ అయ్యర్ 77 , రోహిత్ శర్మ 40 , శుబ్ మాన్ గిల్ 23 పరుగులు , సూర్య కుమార్ యాదవ్ 22, రవీంద్ర జడ 29 , కేఎల్ రాహుల్ 8 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం బరిలో దిగిన ప్రత్యర్ధులకు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా 5 వికెట్లు , కుల్దీప్ యాదవ్ మరియు మొహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లు , సిరాజ్ ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు.

వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పీన్నర్ గా జడ్డు రికార్డుకి ఎక్కాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా సౌత్ఆఫ్రికా తో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు తీసి జడేజా ఈ అరుదైన ఘనత ఘనత సాధించాడు. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ లో , ఐర్లాండ్ పై యువీ కేవలం 31 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఘనతను జడేజా అందుకోవడం విశేషం. కాగా దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 83 పరుగులకే కుప్పకూలిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)