IND VS Srilanka : చిత్తుచిత్తుగా ఓడిపోయిన శ్రీలంక…సెమీస్ కు అర్హత సాధించిన మొదటి టీమ్ గా భారత్…

IND VS Srilanka  : ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంక మరియు భారత్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఏకంగా 358 పరుగులు చేసి టీమ్ ఇండియా బ్యాటర్లు సత్తా చాటగా బౌలర్స్ కూడా బంతితో లంకను చెడుగుడు ఆడారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఒక్కరంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో నిలవలేకపోయారు. అయితే […]

  • Published On:
IND VS Srilanka  : చిత్తుచిత్తుగా ఓడిపోయిన శ్రీలంక…సెమీస్ కు అర్హత సాధించిన మొదటి టీమ్ గా భారత్…

IND VS Srilanka  : ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంక మరియు భారత్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఏకంగా 358 పరుగులు చేసి టీమ్ ఇండియా బ్యాటర్లు సత్తా చాటగా బౌలర్స్ కూడా బంతితో లంకను చెడుగుడు ఆడారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఒక్కరంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో నిలవలేకపోయారు. అయితే మొదట బంతితోనే బుమ్రా వికెట్ తీయగా ,సిరాజ్ 3 వికెట్లు, షమీ టీ వికెట్లు తీయడంతో శ్రీలంక బ్యాటర్లు 19.4 ఓవర్లకి 55 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు. దీంతో భారత్ ఏకంగా 302 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది.

india-became-the-first-team-to-qualify-for-the-semis-after-defeated-sri-lanka

అయితే టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్దేశిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి గాను 357 పరుగులు చేసింది. దీనిలో భాగంగా భారత్ బ్యాటర్స్ శుబ్ మాన్ గిల్ 92 , విరాట్ కోహ్లీ 88 , శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ఇక లంక బౌలర్ మధుషంక 5 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. అనంతరం 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల తాటికి తట్టుకోలేక వెలవెల బొయింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు 5 డక్ ఔట్ అయ్యారు. మిగిలిన వారు ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోని 302 పరుగులు తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో సెమీస్ కు చేరుకున్న మొట్టమొదటి టీమ్ గా రికార్డు సృష్టించింది.