IPL 2023 : టీం ఇండియాకు ఎంపికయ్యే అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి.. సాయి సుదర్శన్ పై తన అభిప్రాయాన్ని తెలియజేసిన హార్దిక్ పాండ్యా…

IPL 2023 : భారతదేశంలో ఐపీఎల్ జాతర మొదలైంది. మార్చి 31న గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పోరుతో ఐపీఎల్ మొదటి మ్యాచ్ పూర్తయింది. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా సారధ్యంలో కొనసాగుతున్న గుజరాత్ జట్టులో తమిళనాడుకు చెందిన కొత్త ఆటగాడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఢిల్లీ తో మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ తో […]

  • Published On:
IPL 2023 : టీం ఇండియాకు ఎంపికయ్యే అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి.. సాయి సుదర్శన్ పై తన అభిప్రాయాన్ని తెలియజేసిన హార్దిక్ పాండ్యా…

IPL 2023 : భారతదేశంలో ఐపీఎల్ జాతర మొదలైంది. మార్చి 31న గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పోరుతో ఐపీఎల్ మొదటి మ్యాచ్ పూర్తయింది. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా సారధ్యంలో కొనసాగుతున్న గుజరాత్ జట్టులో తమిళనాడుకు చెందిన కొత్త ఆటగాడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఢిల్లీ తో మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్.

he-has-all-the-qualities-to-be-selected-for-team-india-hardika-pandya-shares-her-opinion-on-sai-sudarshan

మొన్న జరిగిన మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ భారీ షాట్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు ఈ తమిళ్ నాడు కుర్రాడు . కేవలం 48 బంతులలో 62 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. అతడి ఆట తీరుని చూసి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెచ్చుకున్నాడు. అంతేకాక అతడు ఇలానే తన ఆటను ప్రదర్శిస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా టీమిండియా లో భాగమయ్యే అవకాశంం ఉంటుందని పాండ్యా చెప్పుకొచ్చాడు. సాయి సుదర్శన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడని,  గత 15 రోజులుగా సాయి చేసిన బ్యాటింగ్ ప్రదర్శన తన కష్టానికి ప్రతిఫలం అని ,

he-has-all-the-qualities-to-be-selected-for-team-india-hardika-pandya-shares-her-opinion-on-sai-sudarshan

అతడు ఇలాగే కొనసాగిస్తే నా అంచనా ప్రకారం మరో రెండు సంవత్సరాలలో ఫ్రాంచేసి క్రికెట్ లో ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడని, టీమిండియా కి కూడా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని హార్థిక్ పాండ్యా సాయిని మెచ్చుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్, చెన్నై సూపర్ కింగ్స్ చేధనలో 22 పరుగులు చేశాడు. ఇక రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగగా, ఆ మ్యాచ్లో అలవోకగా షార్ట్స్ ఆడి తన సత్తా చాటుకున్నాడు. అయితే సుదర్శన్ ను గుజరాత్ టీం వేలంలో కేవలం రూ.20 లక్షల కే సొంతం చేసుకోవడం గమనార్హం.