Football : అమెరికాలో ఫుట్ బాల్ ఆడబోతున్న తెలుగు అమ్మాయి ..

Football : వైయస్సార్ జిల్లా పొద్దుటూరు మండలం కానపల్లి గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి త్వరలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగబోతున్న అంతర్జాతీయ పోటీలో పాల్గొననుంది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. శ్రీదేవికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ పై ఆసక్తి ఉండడం గమనించి కడప వైయస్సార్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తరువాత నెల్లూరు శాప్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శ్రీదేవి ఎన్నోసార్లు ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించింది. గతంలో […]

  • Published On:
Football : అమెరికాలో ఫుట్ బాల్ ఆడబోతున్న తెలుగు అమ్మాయి ..

Football : వైయస్సార్ జిల్లా పొద్దుటూరు మండలం కానపల్లి గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి త్వరలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగబోతున్న అంతర్జాతీయ పోటీలో పాల్గొననుంది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. శ్రీదేవికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ పై ఆసక్తి ఉండడం గమనించి కడప వైయస్సార్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తరువాత నెల్లూరు శాప్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శ్రీదేవి ఎన్నోసార్లు ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించింది. గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్ర కటక్ లో జరిగిన జూనియర్ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్టిఎఫ్ పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచింది. ఈనెల రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు మహారాష్ట్రలో ఇండియా ఫుట్బాల్ కు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వజ్జల శ్రీదేవి ఇండియన్ జట్టుకు ఎంపికైంది. ఈమెకు కోచ్ గా కె. సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు.

వజ్జల శ్రీదేవి త్వరలోనే అమెరికాలో జరగబోతున్న అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలో పాల్గొననుంది. ఈ ఏడాది జరగనున్న పోటీలకు ఇండియా జట్టును ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచింది అని కోచ్ సాయి కిరణ్ మాట్లాడారు. ఇక వజ్జలా శ్రీదేవి మాట్లాడుతూ ఇండియన్ జట్టుకు ఎంపికయ్యాను. వరల్డ్ కప్ పోటీలో విజయమే లక్ష్యంగా ప్రతిభ చూపుతా. చిన్నప్పటినుంచి ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం. చదువు లేని నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ల సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పుకొచ్చింది.

Must Read : Actress Hema : నటి హేమ కొత్త బిజినెస్ .. కోట్లలో సంపాదన .. అందుకే సినిమాలకు దూరం ..