IPL Records : ఐపీఎల్ ఆల్ టైం బెస్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా..విరాట్ కోహ్లీ స్థానం సున్నా…

IPL Records :  భారతదేశంలో ఐపీఎల్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసి సత్తా చాటిన 11మంది ఆటగాళ్లెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 11 మందిలో ఒకటో నెంబర్ నుంచి 11వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు. అంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఇప్పటివరకు ఐపీఎల్ లొ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు అన్నమాట. అయితే వీరందరిలో ఐదు స్థానాల్లో బరిలో దిగి అత్యధిక […]

  • Published On:
IPL Records :  ఐపీఎల్ ఆల్ టైం బెస్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా..విరాట్ కోహ్లీ స్థానం సున్నా…

IPL Records :  భారతదేశంలో ఐపీఎల్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసి సత్తా చాటిన 11మంది ఆటగాళ్లెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 11 మందిలో ఒకటో నెంబర్ నుంచి 11వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు. అంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఇప్పటివరకు ఐపీఎల్ లొ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు అన్నమాట. అయితే వీరందరిలో ఐదు స్థానాల్లో బరిలో దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు పైచేయిగా నిలిచారు. అయితే వీరిలో కొందరు ప్రస్తుతం ఐపీఎల్ ఆడడం లేదు. అయినా కూడా వీరి యొక్క రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం.

అయితే ఓపెనింగ్ లో దిగి అత్యధిక పరుగులు చేసిన నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలలో డేవిడ్ వార్నర్ మరియు శేఖర్ ధావన్ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 3864 పరుగులు చేసి నెంబర్ వన్ గా నిలిచాడు. అదే సమయంలో 4852 పరుగులు చేసిన శిఖర్ ధావన్ రెండవ నెంబర్ బ్యాట్స్ మెన్. ఇక 3 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుపులు సాధించిన ఆటగాడు సురేష్ రైనా. ఇక ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2023లో సురేష్ రైనా ఆడడం లేదు. సురేష్ రైనా మూడో స్థానంలో దిగి అత్యధికంగా 4934 పరుగులు సాధించాడు.

ఇక 4 ,5 బ్యాటింగ్ స్థానాలలో రోహిత్ శర్మ మరియు ఎమ్ ఎస్ ధోని ఉన్నారు. ఇక వీరిద్దరూ అధికంగా 2,392 మరియు 1949 పరుగులు చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో దిగిన బ్యాట్స్మెన్ లు అత్యధిక పరుగులు చేయడం విశేషం.ఇక లోయర్ ఆర్డర్లో 6 మరియు 7 బ్యాటింగ్ స్థానాలలో వెస్టిండీస్ ఆటగాళ్లు అత్యధిక పరుగులు చేశారు. 6 స్థానంలో కిరణ్ పోలార్డ్ 1372 పరుగులు చేయగా, ఆండ్రి రసేల్ 718 పరుగులతో 7వ స్థానంలో నిలిచారు.ఆ తర్వాత 8,9,10,11 స్థానాలలో భారత ఆటగాళ్లయిన, హర్భజన్ సింగ్ 406 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 167 పరుగులు, ప్రవీణ్ కుమార్ 86 పరుగులు, మునాఫ్ పటేల్ 30 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నిలిచారు. అయితే ఈ జాబితాలో మన పర్మిషన్ విరాట్ కోహ్లీ లేకపోవడం గమనార్హం.