INDvsAUS World Cup : ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు తరలివస్తున్న సెలబ్రిటీలు…ఎవరంటే…?

INDvsAUS World Cup  : ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి అహ్మదాబాద్ వేదికగా భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని కార్యక్రమాలను నిర్వహించింది. ఇక ఈ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింథియా, […]

  • Published On:
INDvsAUS World Cup : ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు తరలివస్తున్న సెలబ్రిటీలు…ఎవరంటే…?

INDvsAUS World Cup  : ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి అహ్మదాబాద్ వేదికగా భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని కార్యక్రమాలను నిర్వహించింది. ఇక ఈ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింథియా, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సీఎం హిమ్మత్ బిస్వా శర్మ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, సుప్రీంకోర్టు,

celebrities-flocking-to-watch-the-final-match

హైకోర్టు, ఇతర రాష్ట్రాల న్యాయస్థానాల న్యాయమూర్తులు, UAE రాయబారి అబ్దుల్నాసిర్ జమాల్ అల్షాలీ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, USA రాయబారి ఎరిక్ గార్సెట్టి, సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి K సంగమ్, తమిళనాడు UT సంక్షేమ క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత లక్ష్మి మెట్టల్ కూడా స్టేడియానికి చేరుకుని కుటుంబ సమేతంగా ఈ మ్యాచ్ వీక్షించనున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ టాలీవుడ్ సినీ తారలు స్టేడియంలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ నుండి చూసుకుంటే విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో చేరుకున్నట్లు సమాచారం.

అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్లను కూడా బీసీసీఐ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, అలెన్ బోర్డర్ , స్టీవ్ వా , రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ , ఇయాన్ మోర్గాన్ వంటి క్రికెటర్ల రాకతో గ్రౌండ్ మరింత కలర్ ఫుల్ గా కనిపించనుంది. ఇక వీరి కోసం ప్రత్యేకమైన బ్లేజర్ ను బీసీసీఐ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బ్లేజర్లను ధరించి వారంతా మ్యాచ్ వీక్షిస్తారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రస్తుతం జైల్లో ఉండగా ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈ మ్యాచ్ కు హాజరు కావడం లేదట.