Mitchell Marsh : బుద్ధి చూపించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్… ఆరుసార్లు కప్పు గెలిచామన్న పొగరా…ఇలాంటి వారిని ఏం చేయాలి..?
Mitchell Marsh : భారత్ మరియు ఆస్ట్రేలియా కి మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ ని గెలిచేందుకు భారత ఆటగాళ్లు ఎంతగా కష్టపడ్డారు అందరికీ తెలుసు. అయితే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మాత్రం ఆ ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ప్రపంచ కప్ ట్రాఫీ పై కాలు పెట్టి ఫోటో దిగి సోషల్ […]
Mitchell Marsh : భారత్ మరియు ఆస్ట్రేలియా కి మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ ని గెలిచేందుకు భారత ఆటగాళ్లు ఎంతగా కష్టపడ్డారు అందరికీ తెలుసు. అయితే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మాత్రం ఆ ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ప్రపంచ కప్ ట్రాఫీ పై కాలు పెట్టి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆరుసార్లు కప్పు గెలిస్తే మాత్రం ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నేటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఒక్క ఫోటోతో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బుద్ధి చూపిచ్చారంటూ నేటిజెన్లు ఫైర్ అవుతున్నారు.
ఇలాంటివారిని అసలు ప్రపంచ కప్ లోనే తీసుకోవద్దంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అసలేం జరిగిందంటే…. నిన్న జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ కప్పును ఆస్ట్రేలియన్ టీంకు అందజేసిన తర్వాత కప్పు తీసుకొని ఆస్ట్రేలియా క్రికెటర్లు వారి హోటల్ కు వెళ్లారు. ఇక అక్కడ వారి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.అయితే వారి సెలబ్రేషన్స్ లో ప్రపంచ కప్ టోపీని కింద పెట్టడం జరిగింది. అయితే దానిని కింద పెట్టడమే అవమానం అనుకుంటే ట్రోఫీ పై ఆస్ట్రేలియా క్రికెటర్ మిచేల్ మార్స్ కాలు పెట్టి మరి ఫోటో దిగాడు. సాఫీగా సోఫాలో కూర్చుని బీర్ తాగుతూ ట్రోఫీపై కాలు పెట్టి ఫోటోలకు ఫోజులిచ్చాడు. దీంతో దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ ఫోటో చూసిన నేటిజనులు మీరు అవమానించింది కేవలం ట్రోఫీని మాత్రమే కాదని… ప్రపంచ కప్ ని మరియు ఐసీసీ ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచామన్నా పొగరుతో ఈ విధంగా చేస్తున్నారా అంటూ…కోపోద్రిక్తులవుతున్నారు. అయితే 2006లో కూడా ఆస్ట్రేలియా కప్పు గెలిచి ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐపై వాగ్వాదానికి దిగారు.ట్రోఫీ తీసుకునే సమయంలో అమర్యాదగా ప్రవర్తించి వారి పొగరు చూపించారు. అయితే క్రికెట్లో తమను కొట్టేవాడు లేడని ఓవర్ కాన్ఫిడెన్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అందుకే వరల్డ్ కప్ ట్రోఫీ మీద కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా కాలు పెట్టడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వంటివి చేస్తూ అవమానిస్తున్నారు. మరి దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.