Aadhaar : ఆధార్ కార్డులపై కిలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..అలాంటి వారికి ఆధార్ కార్డు రద్దు…

Aadhaar : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. ఏ చిన్న పనికైనా సరే ఆధార్ కార్డు చూపించాల్సిందే. రేషన్ కార్డ్ నుంచి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వరకు అన్ని లావాదేవీలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అంతేకాక ప్రభుత్వ పథకాలు అందుకోవాలన్న ఆధార్ కార్డు నెంబర్ కావాల్సిందే. అంతటి ప్రయోజనం ఉన్న ఆధార్ కార్డు పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. […]

  • Published On:
Aadhaar : ఆధార్ కార్డులపై కిలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..అలాంటి వారికి ఆధార్ కార్డు రద్దు…

Aadhaar : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. ఏ చిన్న పనికైనా సరే ఆధార్ కార్డు చూపించాల్సిందే. రేషన్ కార్డ్ నుంచి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వరకు అన్ని లావాదేవీలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అంతేకాక ప్రభుత్వ పథకాలు అందుకోవాలన్న ఆధార్ కార్డు నెంబర్ కావాల్సిందే. అంతటి ప్రయోజనం ఉన్న ఆధార్ కార్డు పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి మరణిస్తే వారి యొక్క ఆధార్ కార్డు మెసేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈలాంటి క్రమంలో వారి ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా రద్దయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను అమలులోకి తీసుకురాబోతుందట.

Govt withdraws its recent 'Aadhaar advisory', says exercise normal prudence - BusinessToday

దీనివలన చనిపోయిన వారి ఆధార్ కార్డులపై ఉన్న పథకాలన్నీ ఆగిపోతాయి. అయితే ఈ విషయంపై తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రి శాఖ క్లారిటీ ఇచ్చింది. చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అయ్యే విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కార్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే అలాంటి విధానం అందుబాటులో లేదని, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల నియమించిన రిజిస్టర్ల నుండి చనిపోయిన వ్యక్తులు ఆధారులను డియాక్టివేట్ చేసే మెకానిజం అందుబాటులో లేదు. అయితే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది.

 

అయితే జనన మరణాల రిజిస్ట్రేషన్ల చట్టం 1965 కి ముసాయిదా సవరణలు చేసి డెత్ సర్టిఫికెట్ ను ఇచ్చే సమయంలో ఆధార్ కార్డును స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అపాయింట్ చేసిన రిజిస్టర్స్ లో స్థానిక జనన మరణాలను నమోదు చేస్తారు. దీని ఆధారంగా చేసుకుని చనిపోయిన వారి ఆధార్ కార్డులను రద్దు చేయబోతున్నారని, దీంతో ఆ కార్డుల ద్వారా అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అర్థమవుతుంది. అంతేకాక వారి ఆధార్ కార్డులను మిస్ యూస్ చేయకుండా అడ్డుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించారు.