Toll Gate : కచ్చితంగా తెలుసుకోవాల్సిన టోల్ గేట్ రూల్స్…ఇవి తెలిస్తే రూపాయి కట్టకుండా వెళ్ళిపోవచ్చు…
Toll Gate : జాతీయ రహదారులపై టోల్ గేట్స్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఎంత పెద్ద వాహనమైన ఈ టోల్ గెట్ చూడగానే కాస్త వేగం తగ్గుతుంది. ఇక ఈ టోల్ గేట్ లో అక్కడ పేర్కొన్న వాహనాలను బట్టి చార్జెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికోసం ఒకప్పుడు గంటల తరబడి క్యూలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతుండడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా […]
Toll Gate : జాతీయ రహదారులపై టోల్ గేట్స్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఎంత పెద్ద వాహనమైన ఈ టోల్ గెట్ చూడగానే కాస్త వేగం తగ్గుతుంది. ఇక ఈ టోల్ గేట్ లో అక్కడ పేర్కొన్న వాహనాలను బట్టి చార్జెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికోసం ఒకప్పుడు గంటల తరబడి క్యూలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతుండడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్యాగ్ సదుపాయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇక దీని కారణంగా ఆటోమేటిగ్ గా బిల్లు చెల్లించి ఎక్కువసేపు వేచి ఉండకుండానే టోల్ గేట్ నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే దీనితో పాటు కొన్ని రూల్స్ కూడా అమలు చేయడం జరిగింది. ఇక అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను పాస్ చేసింది. ఇక దీనిలో భాగంగానే 2021లో 10 సెకండ్ల నియమాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అదే ఇప్పుడు మనం వినియోగిస్తున్న పాస్ట్ ట్యాగ్. ఇక ఈ పాస్ట్ టాగ్ ఇంటిగ్రేషన్ ఉండడం వలన ఎక్కువసేపు వేచి ఉండకుండా 10 సెకండ్లలోనే వాహనం టోల్ గేట్ దాటే నియమాన్ని పొందుపరచడం జరిగింది. అయితే ఈ 10 సెకండ్ల నియమం ఏంటంటే..? టోల్ గేట్ వద్ద రద్దీ వేళలో కూడా ఒక్కో వాహనం 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం వేచి చూడకూడదని దీనిని తీసుకురావడం జరిగింది.
అంటే టోల్ గేట్ వద్ద కనీస నిరీక్షణ సమయం 10 సెకండ్లు మాత్రమే. అలాగే 100 మీటర్లకు మించి క్యూలో వేచి చూడకూడదు అని కూడా ఈ నియమాలలో పేర్కొంది. తద్వారా ఎక్కువ సమయం వాహనాలు క్యూలో ఉండకుండా సులభంగా ట్రాఫిక్ నుంచి బయటపడవచ్చు. అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒకవేళ మీరు 100 మీటర్స్ కంటే ఎక్కువ దూరం నుండి క్యూ లో ఉన్న లేదా టోల్ గేట్ దాటడానికి మీకు 10 సెకండ్లు దాటిన మీ వద్ద డబ్బులు తీసుకోకూడదు. అలాగే టోల్ గేట్ లైన్ లో 100 మీటర్ల ముందు పసుపు లైన్ మార్కింగ్ చేసి ఉండాలి. జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణం సాగిందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకురావడం జరిగింది. కానీ ఇవి చాలామందికి తెలియవు.