5G Charges : 5 జీ యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన జియో ఎయిర్టెల్…
5G Charges : భారత దిగ్గజ టెలికాం సంస్థలు అయినా జియో మరియు ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న 5జీ అన్ లిమిటెడ్ డేటా సేవలను త్వరలోనే నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీటికి కూడా చార్జీలు వసూలు చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ ఏడాది అర్థ భాగం నుండే 5జీ సేవలకు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభమై […]
5G Charges :
భారత దిగ్గజ టెలికాం సంస్థలు అయినా జియో మరియు ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న 5జీ అన్ లిమిటెడ్ డేటా సేవలను త్వరలోనే నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీటికి కూడా చార్జీలు వసూలు చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ ఏడాది అర్థ భాగం నుండే 5జీ సేవలకు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభమై దాదాపు ఏడాది అవుతుంది. జియో మరియు ఎయిర్టెల్ కంపెనీలు మాత్రమే అత్యధిక సాంకేతికతతో ఈ 5జీ సేవలను అందించాయి.
దీంతో ప్రస్తుతం 5జీ మొబైల్ కలిగి ఉన్నవారు 5 జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఫ్రీగా డేటాను అందుకుంటున్నారు. అయితే మొట్ట మొదటగా ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రమే ఈ సేవలను అందించిన కంపెనీలు క్రమ క్రమంగా అంతటా విస్తరింప చేశారు. ఈ నేపథ్యంలోనే 5 జీ డేటా వినియోగంపై ఎలాంటి పరిమితులు కూడా విధించలేదు.దీంతో వినియోగదారులు ఫ్రీగా అన్ లిమిటెడ్ డేటా వినియోగించుకోగలుగుతున్నారు.దీని ద్వారా ఇప్పటికే చాలామంది 5జీ ఫోన్లను కొనుగోలు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా మరికొన్ని రోజుల్లో ఫ్రీ డేటా సేవలను నిలిపివేయాలని జియో మరియు ఎయిర్టెల్ టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఫ్రీ 5జీ డేటాకు స్వస్తి పలికి దీనికి కూడా తగిన చార్జీలు వసూలు చేసే దిశగా జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది జూన్ లేదా జూలై నుండే చార్జీలు వసూలు చేస్తారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచూరించడం జరిగింది .అయితే ప్రస్తుతం రెండు టెలికాం కంపెనీలు జియో మరియు ఎయిర్టెల్ 4జి ప్లాన్స్ కే 5జి సేవలను ఉచితంగా ఇస్తున్నాయి. ఇక ఈ ఏడాది జూలై నుండి 5జీ సేవలకు ఎక్కువ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఉచితంగా ఇచ్చిన 5జీ సేవలకు ఇప్పటినుండి చార్జీలు వసూలు చేయాలని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీఛార్జ్ ధరలు 20 శాతం పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.