Farmers Idea : పంటలు కాపాడుకోవడంలో ట్రెండు మార్చిన రైతులు..

Farmers Idea  : సాధారణంగా పక్షుల జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పొలాలలో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు. అయితే అవి కేవలం బొమ్మలేనని అవి వాటిని ఏమీ చెయ్యలేవు అని గ్రహించిన పక్షులు జంతువులు పంటలను పాడుచేసి పోతున్నాయి. దానితో విసుగు చెందిన ఒక యువరైతు వినూత్నంగా ఆలోచన చేశారు. తన పంటను కాపాడుకోవడనికి రాజకీయ నేతలు పెద్దపెద్ద కటౌట్లు అందమైన హీరోయిన్ల ఫొటోల ఫ్లెక్సీలను తన పొలం లో ఏర్పాటు చేశారు. దానితో నిజంగా […]

  • Published On:
Farmers Idea : పంటలు కాపాడుకోవడంలో ట్రెండు మార్చిన రైతులు..

Farmers Idea  : సాధారణంగా పక్షుల జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పొలాలలో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు. అయితే అవి కేవలం బొమ్మలేనని అవి వాటిని ఏమీ చెయ్యలేవు అని గ్రహించిన పక్షులు జంతువులు పంటలను పాడుచేసి పోతున్నాయి. దానితో విసుగు చెందిన ఒక యువరైతు వినూత్నంగా ఆలోచన చేశారు. తన పంటను కాపాడుకోవడనికి రాజకీయ నేతలు పెద్దపెద్ద కటౌట్లు అందమైన హీరోయిన్ల ఫొటోల ఫ్లెక్సీలను తన పొలం లో ఏర్పాటు చేశారు. దానితో నిజంగా అక్కడ మనుషులు ఉన్నారు అని భావించిన పక్షులు దరిదాపులకి రాకుండా పారిపోతున్నాయి. అయితే ఈ విచిత్ర సంఘటన మెహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీద తండాకు చెందిన ఒక యువ రైతు తన పంట చేనిలో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో అతనికొక ఐడియా వచ్చింది. దీంత వెంటనే పార్టీ నేతల కటౌట్లను తీసుకుని వచ్చి తన పంట చేనిలో ఏర్పాటు చేశాడు. అతనిని చూసినా మరో రైతు బికినీలలో ఉన్న హీరోయిన్ల ఫోటోల ఫ్లెక్సీలను అతని పంట పొలాలలో ఏర్పాటు చేశాడు. ఇక వాటిని చూసి మనుషులే ఉన్నారు అని భావించిన కోతులు అక్కడ నుండి పారిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అంతేకాదు పంట పొలాలు రోడ్డు పక్కనే ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే వాళ్ల దృష్టి అంత పంట పైన పడకుండా వీటిపై పడి దిష్టి అంతా తొలగిపోయింది అని రైతులు అంటున్నారు.

అయితే ఈ మార్గంలో వెళ్లే చాలా మంది రైతు పంటచేలల్లో ఏర్పాటుచేసిన కటౌట్లను చూస్తున్నారు. పంటలు కాపాడుకోవడంలో రైతులు ట్రెండ్ మార్చారు అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ రైతులకు ఇంత పెద్ద కటౌట్ లో ఎక్కడివి అని ప్రశ్నించగా ఆ మధ్య ఎన్నికల ప్రచారం లో భాగంగా నియోజకవర్గంలో సీఎం సభలను ఏర్పాటు చేశాట. అయితే సభ ముగిసిన తరువాత ఆ కటౌట్లను తీసుకువచ్చి ఇలా పంట చేలలో ఏర్పాటు చేసినట్లు రైతులు తెలిపారు. ఇక రైతుల తెలివికి ప్రతి ఒక్కరు దాసోహం అనక తప్పడం లేదు.