Turn Off Your Ph : డిసెంబర్ 20న అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి…వివో అధికారిక ప్రకటన..

Turn Off Your Ph : నేటి కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ అనేది నిత్యవసరాలలో ఒకటిగా మారిపోయింది. అంతేకాక ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్రతిదీ మొబైల్ ఫోన్ లోనే చేయాల్సి వస్తుంది కనుక ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది కంపల్సరిగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ వలన కొంత లాభం ఉన్నప్పటికీ ఎక్కువగా నష్టాలే ఉన్నాయని చెప్పాలి. […]

  • Published On:
Turn Off Your Ph : డిసెంబర్ 20న అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి…వివో అధికారిక ప్రకటన..

Turn Off Your Ph : నేటి కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ అనేది నిత్యవసరాలలో ఒకటిగా మారిపోయింది. అంతేకాక ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్రతిదీ మొబైల్ ఫోన్ లోనే చేయాల్సి వస్తుంది కనుక ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది కంపల్సరిగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ వలన కొంత లాభం ఉన్నప్పటికీ ఎక్కువగా నష్టాలే ఉన్నాయని చెప్పాలి. అవేంటో మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ఫోన్ వాడకంతో కలిగే అనర్ధాల గురించి తెలియజేసేందుకు స్మార్ట్ ఫోన్ మేకర్స్ వివో “స్విచ్ ఆఫ్” పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈనెల 20న తమ కస్టమర్లు అందరూ స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా వివో సంస్థ కోరింది.

everyone-switch-off-your-phone-on-december-20-vivo-official-announcement

ఈనెల 20న రాత్రి 08:00 నుంచి రాత్రి 9:00 వరకువారి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ,వారితో కాసేపు గడపాలని వివో సంస్థ తమ కస్టమర్లను కోరింది. అయితే తాజాగా వారు నిర్వహించిన ఓ సర్వేలో 77 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారని తేలింది. దీని కారణంగా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అనుబంధం బంధుత్వం తగ్గిపోతుందని వివో పేర్కొంది. అంతేకాక చాలామందికి ఫోన్ ఒక వ్యసనంలా మారిందని పేర్కొంది. దీనిని నిర్మూలించే విధంగా వివో సంస్థ స్విచ్ ఆఫ్ పేరుతో ఈ ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆయా కుటుంబాల మధ్య బంధుత్వం పెరుగుతుందని వివో సంస్థ ఆలోచన. మరి దీనికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతారో డిసెంబర్ 20న చూడాలి.