Trees on Dividers : రోడ్డు మధ్యలో చెట్లు ఎందుకు నాటుతారో తెలుసా..?బలమైన కారణమే ఉంది…

Trees on Dividers  : మనమందరం ప్రతిరోజు నిత్యం వాహనాలలో ప్రయాణం చేస్తూనే ఉంటాం. అలాగే హైవే లపై కూడా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే హైవే ల పై వెళ్లే సమయంలో రోడ్డుకు మధ్యలో డివైడర్ పై చెట్లు కనిపిస్తుంటాయి. అసలు అక్కడ చెట్లు ఎందుకు నాటుతారో ఎప్పుడైనా ఆలోచించారా..?రోడ్డుకు మధ్యలో చెట్లు అలా కనిపిస్తుంటే చాలా అందంగా ఉంటుంది కానీ ఆ చెట్లను రోడ్డు మధ్యలో నాటడానికి ఒక బలమైన కారణమే ఉందట. […]

  • Published On:
Trees on Dividers : రోడ్డు మధ్యలో చెట్లు ఎందుకు నాటుతారో తెలుసా..?బలమైన కారణమే ఉంది…

Trees on Dividers  : మనమందరం ప్రతిరోజు నిత్యం వాహనాలలో ప్రయాణం చేస్తూనే ఉంటాం. అలాగే హైవే లపై కూడా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే హైవే ల పై వెళ్లే సమయంలో రోడ్డుకు మధ్యలో డివైడర్ పై చెట్లు కనిపిస్తుంటాయి. అసలు అక్కడ చెట్లు ఎందుకు నాటుతారో ఎప్పుడైనా ఆలోచించారా..?రోడ్డుకు మధ్యలో చెట్లు అలా కనిపిస్తుంటే చాలా అందంగా ఉంటుంది కానీ ఆ చెట్లను రోడ్డు మధ్యలో నాటడానికి ఒక బలమైన కారణమే ఉందట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా.. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎక్కువగా చెట్లు నాటుతున్న విషయం తెలిసిందే. చెట్లు అధికంగా ఉండటం వలన కాలుష్యం కూడా నివారించవచ్చు. అంతేకాక అనేక రకాల ప్రయోజనాలకు చెట్లు దోహదపడుతుంటాయి. అయితే రోడ్డు మధ్యలో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి అక్కడ మట్టి తప్ప మరేమీ ఉండకుండా చూస్తారు.

11 Benefits of Street Trees | Hardscape Blog

దానికి గల కారణం వానలు పడినప్పుడు నీరు భూమిలో ఇంకాలనే ఉద్దేశంతోనే ఇలా రోడ్డు మధ్యలో ఖాళీగా ఉంచుతారట. అలాగే వాటిపై డివైడర్లు ఏర్పాటు చేసే మొక్కల్ని కూడా పెంచుతుంటారు. ఇలా చెట్లను ఎక్కువగా పెంచడం వలన ప్రయాణం చేసేటప్పుడు మరింత ఉల్లాసంగా అనిపిస్తుంది. కంటికి నింపుగా మనసు శరీరం చల్లబడిన భావన కలుగుతూ ఉంటుంది. అంతేకాక ఈ చెట్లు రోడ్డు మధ్యలో ఉండటం వలన డ్రైవర్లు , ప్యాసింజర్లు , ఎండ , కాలుష్యం వంటి వాటి నుండి కాస్త రిలీఫ్ పొందుతున్నారు. అలాగే ఉల్లాసభరితమైన వాతావరణంలో ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఇవన్నీ రోడ్డు మధ్యలో చెట్లు నాటడానికి ఒక కారణం అని చెప్పవచ్చు . కానీ అన్నింటికంటే బలమైన ముఖ్యమైన కారణం ఏంటంటే.

రోడ్డుకు మధ్యలో ఇలా చెట్లు నాటడానికి భద్రతాపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు ఇరువైపులా వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దీనివలన ఎదురుగా వచ్చే వాహనాల లైట్ కాంతి ఎదురుగా వస్తున్న మరో డ్రైవర్ పై పడి డ్రైవర్ చూపుకు ఇబ్బంది కలగకుండా ఈ చెట్టు కాంతిని అడ్డుకుంటుంది. దీని కారణంగా ప్రమాదాలను నివారిస్తున్నారని ప్రముఖులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు హైబీమ్ వెల్తురుతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎదురుగా ప్రయాణిస్తున్న వాహనాల కాంతి ఇబ్బందిని కలిగించి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ప్రమాదాల నుండి నుండి రక్షించేందుకే రోడ్డుకు మధ్యలో చెట్లను పెంచి ఆ కాంతిని అడ్డుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ వాహనాల నుండి వచ్చే లైట్ ను అడ్డుకోవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి.