Paytm Payment Bank : బిగ్ బ్రేకింగ్ పేటీఎం ఇక లేదు ఆర్.బి.ఐ సంచలన ప్రకటన…
Paytm Payment Bank : హోటల్ కి వెళ్తే పేటియం షాపింగ్ కి వెళ్తే పేటియం ఆఖరికి కూరగాయల మార్కెట్ కి వెళ్ళిన పేటీఎం ని యూస్ చేస్తున్నారు. చివరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా పేటియం చేస్తున్నారు. అయితే 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరినోళ్లలో నాని అందరి మొబైల్ లో చేరి క్రమంగా ట్రాన్సాక్షన్ పెరిగాయి. కానీ ఏం లాభం పెరుగుట విరుగుట […]
Paytm Payment Bank : హోటల్ కి వెళ్తే పేటియం షాపింగ్ కి వెళ్తే పేటియం ఆఖరికి కూరగాయల మార్కెట్ కి వెళ్ళిన పేటీఎం ని యూస్ చేస్తున్నారు. చివరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా పేటియం చేస్తున్నారు. అయితే 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరినోళ్లలో నాని అందరి మొబైల్ లో చేరి క్రమంగా ట్రాన్సాక్షన్ పెరిగాయి. కానీ ఏం లాభం పెరుగుట విరుగుట కొరకే అన్నారు పెద్దలు. ఇక ఆ పాత మాటలనే నిజం చేసిందా అని ఈ కథ విన్నా ఎవరి కైన అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. 2021లో ఆర్.బి.ఐ హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడి ఉంటే సీను ఇక్కడ వరకు వచ్చేది కాదేమో. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా లేదా పేటీఎం పరిస్థితి ఏంటి అని దేశంలో ఇద్దరు సామాన్యులు ఒకరిని ఒకరు అడిగే ప్రశ్న.
అయితే వారికి పేటియం మనీలాండరింగ్ కేవైసీ ఉల్లంఘన పేటీఎం వాలెట్ పేమెంట్స్, బ్యాంక్ వద్ద నడిచిన అక్రమ లావాదేవీలు ఇవేవీ తెలియదు. మనకి తెలిసిందల్లా ఏదైనా ఉంటే పేటీఎంతో కొట్టేయడం. దానికోసం ఫిబ్రవరి తరువత అది పనిచేస్తుందా లేదా అని కావాలి అందుకే ఇధి మిలియన్ డాలర్ల ప్రశ్న అయింది. ఎందుకంటే పేటీమ్ భవిష్యత్తు ఆర్బిఐ మీదే ఆధారపడి ఉంది. ఇంతకీ పేటీఎం కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి. ఇక ఈ సవాల్ ని పేటియం ఎలా ఎదుర్కొంటుంది మళ్లీ పూర్వ వైభోగాన్ని తెచ్చుకుంటుందా.. అనె వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పేటియం వినియోగదారులు అయితే దాని లావాదేవీలు ఈనెల ఫిబ్రవరి 29 వరకే చేయగలరు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం పాస్టర్లు చెల్లించడం టాప్ అప్ లు చేయడం ఇలాంటివి ఏమీ చేయలేరు. ఎందుకంటే ఈ తరహా ఆర్థిక లావాదేవీలు అన్ని ఆపేయమని ఆర్బిఐ పేటీమ్ కు ఆర్డర్లు పాస్ చేస్తుంది.
బయట ఆడిటర్ల సమస్త పరిస్థితి క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత ఏం జరుగుతుంది అనేది సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ పైనే ఆధారపడి దీని భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. అందుకే ఆ తేదీపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఏ సంస్థ అయినా సరే తమ వినియోగదారుల నుండి కేవైసీ కచ్చితంగా తీసుకుంటుంది. కానీ పేటీమ్ సంస్థ కు మాత్రం 35 కోట్ల ఈ వాలెట్ ఖాతాలు ఉన్నాయని చెప్పాలి. ఇక వీటిలో పనిచేస్తుంది నాలుగు కోట్లు మాత్రమే. అవి కూడా కొద్దిపాటి బ్యాంక్ తో కలిసి ఉన్నాయి. ఇక దీనిపై అనేక రకాల పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇక దీనిపై ఆర్బిఐ 2019 లొనే స్పందించి పేటీఎం ను హెచ్చరించింది. అయినప్పటికీ పేటీఎం సంస్థ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే ఈ సంస్థ నాశనానికి కారణమైందని చెప్పాలి. అక్రమ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆర్బిఐ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి 29 తర్వాత పేటియం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.