AC power saving tips : ఏసీ ఉండడం వలన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని బాధపడుతున్నారా… అయితే ఈ ట్రిక్ మీకోసమే..

AC power saving tips : వేసవికాలం వచ్చేసింది ఎండలను తట్టుకొని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడం కష్టమే. ఏసి పెట్టించుకుందామా అంటే నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ కరెంట్ బిల్లుకు భయపడి ఏసి ఉన్నా కూడా చాలామంది ఉపయోగించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఏసి వేసుకున్న కూడా కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేలా ఉండేందుకు మీకోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. ఈ చిట్కాలను పాటిస్తే కొంతవరకు ఈ బాధ […]

  • Published On:
AC power saving tips : ఏసీ ఉండడం వలన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని బాధపడుతున్నారా… అయితే ఈ ట్రిక్ మీకోసమే..

AC power saving tips : వేసవికాలం వచ్చేసింది ఎండలను తట్టుకొని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడం కష్టమే. ఏసి పెట్టించుకుందామా అంటే నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ కరెంట్ బిల్లుకు భయపడి ఏసి ఉన్నా కూడా చాలామంది ఉపయోగించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఏసి వేసుకున్న కూడా కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేలా ఉండేందుకు మీకోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. ఈ చిట్కాలను పాటిస్తే కొంతవరకు ఈ బాధ నుంచి బయటపడవచ్చు. అయితే గది తలుపులను తరచూ మోయడం తిరగడం వలన బయట ఉండే వేడిగాలి లోపలికి వస్తుంది. దీంతో గది చల్లదనం తగ్గి ఏసి ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి ఉంటుందిి.

are-you-worried-that-the-current-bill-will-be-high-due-to-having-ac-but-this-trick-is-for-you

are-you-worried-that-the-current-bill-will-be-high-due-to-having-ac-but-this-trick-is-for-you

కాబట్టి తలుపులను తరచుగా తెరవకుండా ఉండాలి. అలాగే ముందుగా ఏసిని ఆన్ చేసి గది త్వరగా చల్లబడాలని 16 డిగ్రీ లో ఉంచుతాం. ఆ తర్వాత దానిని తగ్గించేస్తాం. అయితే విద్యుత్ ఆదా కావాలనుకునేవారు ఇలా అసలు చేయకూడదు. ఏసీ ని ఎప్పుడు ఒకే ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది. దీనివలన విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఏసీ ఫిల్టర్లను వారానికి ఒకసారి కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. దీనివలన గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దీంతో గది త్వరగా చల్లబడుతుంది. అలాగే ఏసి టెంపరేచర్ ను 25 – 27 డిగ్రీల మధ్యలో మెయింటైన్ చేయడం వలన విద్యుత్ ను ఆదా చేయవచ్చు. అంతకంటే తక్కువ టెంపరేచర్లో మెయిన్టైన్ చేస్తే కంప్రెషన్ మీద భారం పడి విద్యుత్ ఎక్కువగా ఖర్చవుతుంది. అలాగే ఏసి ఆన్ చేసినప్పుడు మనం సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తాం.

are-you-worried-that-the-current-bill-will-be-high-due-to-having-ac-but-this-trick-is-for-you

are-you-worried-that-the-current-bill-will-be-high-due-to-having-ac-but-this-trick-is-for-you

దీనివలన గది త్వరగా చల్లబడుతుందని సీలింగ్ ఫ్యాన్ వేస్తాం కానీ అది తప్పు. సీలింగ్ ఫ్యాన్ వేయడం వలన పైకప్పు నుండి వచ్చే వేడి గది మొత్తం వ్యాపిస్తుంది. దీంతో ఏసి మరింత పనిచేయాల్సి ఉంటుంది. అలాగే గదిలో విండోలు తలుపులు నుండి గాలి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే తలుపులకు విండోలకు కట్టెను తప్పనిసరిగా వేసుకోవాలి దీని ద్వారా బయట నుంచి వేడి గాలులు లోపలికి రావు. అలాగే ఏసీ గదిని సీలింగ్ చేపించుకోవడం తప్పనిసరి. సీలింగ్ ఉండడం వలన గది త్వరగా చల్లబడుతుంది. అలాగే గదిలో ఎంతమంది ఉన్నారు వంటి అంశాలు కూడా ఉష్ణోగ్రత మరియు గది చల్లబడే పరిస్థితులను ప్రభావం చేస్తాయి కాబట్టి ఈ వేసవికాలం ఈ చిట్కాలను పాటించి కరెంట్ బిల్లును తగ్గించుకోండి.

గమనిక : పైన పేర్కొన్న అంశాలు సూచనలు , ఇంటర్నెట్లో మరియు సామాజిక మాధ్యమాల్లో లభించే సమాచారం ద్వారా తెలియజేయడం జరిగింది. దీనిని తెలుగు టాప్ న్యూస్ ధ్రువీకరించలేదు.