Texts App : అస్సాం కుర్రాడు కనిపెట్టిన యాప్…రూ.416 కోట్లకు కొన్న అమెరికా కంపెనీ…

Texts App : ఏ రంగంలోనైనా సరే మన భారతీయులకు తిరుగు లేదని ఎంతో మంది నిరూపించారు. ఈ క్రమంలోనే చాలామంది మన భారతదేశ కీర్తిని ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరించేలా చేశారు. అయితే తాజాగా అస్సాం కు చెందిన ఒక కుర్రాడు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎవరు సాధించని అరుదైన ఘనతను సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగు లేదని మరోసారి నిరూపించేలా ఈ అస్సాం కుర్రాడు చేసి చూపించాడు. అయితే […]

  • Published On:
Texts App : అస్సాం కుర్రాడు కనిపెట్టిన యాప్…రూ.416 కోట్లకు కొన్న అమెరికా కంపెనీ…

Texts App : ఏ రంగంలోనైనా సరే మన భారతీయులకు తిరుగు లేదని ఎంతో మంది నిరూపించారు. ఈ క్రమంలోనే చాలామంది మన భారతదేశ కీర్తిని ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరించేలా చేశారు. అయితే తాజాగా అస్సాం కు చెందిన ఒక కుర్రాడు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎవరు సాధించని అరుదైన ఘనతను సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగు లేదని మరోసారి నిరూపించేలా ఈ అస్సాం కుర్రాడు చేసి చూపించాడు. అయితే టెక్ విభాగంలో బాగా ఆసక్తి ఉన్న ఈ కుర్రాడు కొత్తగా ఓ యాప్ ను కనిపెట్టాడు.

an-app-invented-by-an-assam-boy-was-bought-by-an-american-company-for-rs-416-crores

ఆల్ ఇన్ వన్ మేనేజింగ్ ఆప్ అని కొత్త యాప్ ను క్రియేట్ చేశాడు. ఇక ఈ యాప్ ను అమెరికా దిగ్గజ సంస్థలలో ఒకటైన టెక్ కంపెనీ ఏకంగా రూ.416 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఈ బిజినెస్ డీల్ పూర్తయిన తర్వాత యువకుడు యూఎస్ నుండి తన స్వగ్రామం దిబ్రూఘడ్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అతని కుటుంబ సభ్యులు యువకుడికి ఘన స్వాగతం పలికారు. అయితే చార్యాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా , నమితా బగారీయా కు కిషన్ అనే కుమారుడు ఉన్నాడు.

an-app-invented-by-an-assam-boy-was-bought-by-an-american-company-for-rs-416-crores

అయితే కిషన్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.అనంతరం అక్కడ చదువులను పూర్తి చేసుకున్న కిషన్ తాజాగా texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ను రూపొందించాడు. ట్విట్టర్ ,ఇంస్టాగ్రామ్, మెసెంజర్ ,వాట్సాప్ వంటి యాప్ లలో కాంటాక్ట్స్ ని ఉపయోగించి దీనిలో చాటింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్ ను అమెరికా సంస్థలలో ఒకటైన ఆటోమేటిక్ టెక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడు గా మారిపోయాడు. అంతేకాక భారతదేశ పేరును దశదిశల వ్యాపించేలా చేశాడు. దీంతో ప్రస్తుతం కిషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ కుర్రాడు ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.