Viral Video : గుప్పెడు నీళ్ల కోసం ఇంతటి కష్టమా….మీ ఓపికకు దండం తల్లీ….

Viral Video : నగరాలలో నివసించే ప్రజలకు ఎన్నో వసతులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ప్రభుత్వాలు కూడా పట్టణీకరణకు దోహదపడడంతో నగర జీవితం రోజురోజుకు సుఖవంతంగా మారుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం అంత అభివృద్ధి నోచుకోకపోవడం గమనార్హం. దీని కారణంగా అక్కడ నివసించే ప్రజలు వారి కనీస అవసరాలను తీర్చుకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. నీరు దొరకని ప్రాంతాలలో […]

  • Published On:
Viral Video : గుప్పెడు నీళ్ల కోసం ఇంతటి కష్టమా….మీ ఓపికకు దండం తల్లీ….

Viral Video : నగరాలలో నివసించే ప్రజలకు ఎన్నో వసతులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ప్రభుత్వాలు కూడా పట్టణీకరణకు దోహదపడడంతో నగర జీవితం రోజురోజుకు సుఖవంతంగా మారుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం అంత అభివృద్ధి నోచుకోకపోవడం గమనార్హం. దీని కారణంగా అక్కడ నివసించే ప్రజలు వారి కనీస అవసరాలను తీర్చుకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. నీరు దొరకని ప్రాంతాలలో వారి పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఇటీవల ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

గుప్పెడు నీళ్ల కోసం ఇద్దరు మహిళలు కష్టపడుతున్న తీరు చూసి నెటిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు బోరుబావిలో అడుగంటుకుపోయిన నీటిని తోడేందుకు చాలా కష్టపడుతున్నారు. ఎర్రటి ఎండలో ఇద్దరు మహిళలు కలిసి చిన్న పైప్ సహాయంతో బోర్ బావిలో ఉన్న నీటిని చాకచక్యంగా ,ఓపికగా తోడుతున్నారు. చిన్న పైపు సహాయంతో నీరును తోడడం వలన ఒక బకెట్ నిండేందుకు వారు కనీసం ఐదు సార్లు బోరుబావిలోకి పైపు ను వేయాల్సి వస్తుంది. ఎర్రటి ఎండలో అక్కడ ఉన్న బకెట్లన్నీ నింపాలంటే వారికి చాలా సమయం పడుతుంది.

వీరి కష్టం చూసిన నేటి జనులు కంటతడి పెట్టుకుంటున్నారు. మీ ఓపికకు ఒక దండం తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతటి కష్టం చేయాలంటే ఎవరి తరం కాదు. ఈ వీడియో చాలామందికి గుణపాఠం అని కూడా చెప్పవచ్చు. చిన్న చిన్న సమస్యలకే బాధపడే వారికి మనకంటే కష్టాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారని ఈ వీడియో అర్థమయ్యేలా చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ వీడియో దాదాపుగా 3.4 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

https://twitter.com/DaleRTyMG/status/1665451106267217923