Upasana konidela : ఉపాసన కొణిదెల డెలివరీ డేట్ ప్రకటించిన చిరంజీవి ..

Upasana konidela : రామ్ చరణ్, ఉపాసనల వివాహం అయి దాదాపుగా పదేళ్లు కావస్తుంది. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని మెగా అభిమానులు ఎదురు చూశారు. ఈ క్రమంలోనే చిరంజీవి రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అని ప్రకటించాడు. దీంతో అభిమానులు త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి కూడా ఫ్యామిలీ పరంగా, సినిమా పరంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య […]

  • Published On:
Upasana konidela : ఉపాసన కొణిదెల డెలివరీ డేట్ ప్రకటించిన చిరంజీవి ..

Upasana konidela : రామ్ చరణ్, ఉపాసనల వివాహం అయి దాదాపుగా పదేళ్లు కావస్తుంది. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని మెగా అభిమానులు ఎదురు చూశారు. ఈ క్రమంలోనే చిరంజీవి రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అని ప్రకటించాడు. దీంతో అభిమానులు త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి కూడా ఫ్యామిలీ పరంగా, సినిమా పరంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా అద్బుతమైన వసూళ్లను సాధిస్తూ రికార్డులను తిరగరాస్తున్నది. అయితే చిరంజీవి తమ ఫ్యామిలీ లోకి రాబోతున్న వారసుడు గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

నా జీవితంలో 2022 సంవత్సరం ఎన్నో తీపి గుర్తులను అందించింది. నా కెరీర్ 45 ఏళ్లుగా సుదీర్ఘంగా కొనసాగుతుంది. సినిమాల్లో ఇంకా నటించాలని అనుకుంటున్నాను. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటాను. ఇప్పుడు వరుసగా నాలుగైదు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సినిమా షూటింగ్లో ఉంటే హుషారుగా ఉంటాను. సెట్లోకి వెళ్లాలనే ఆలోచన రాగానే ఓకే ఎనర్జీ వస్తుంది. ఇక మా కుటుంబం అంతా రామ్ చరణ్ వారసుడు కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాం అని చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2023లో శుభవార్తను అందిస్తారు.

బహుశా జూలైలో కానీ ఆగస్టులో కానీ ఆ శుభవార్తను చెబుతారు. ప్రస్తుతం మా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉందని చిరంజీవి అన్నారు. ఇక చిరంజీవి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. త్వరలోనే భారీ వసూళ్లను రాబడుతుంది. అలాగే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ అవార్డ్స్ అందుకుంది. 2023 ఎంతో శుభప్రదంగా అనిపిస్తుంది. 2023లో మెగా ఫ్యామిలీ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లతో ఆనందంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఉపాసన ఆగస్టు నెలలో కానీ జూలై నెలలో కానీ డెలివరీ అవ్వవచ్చు అని తెలుస్తుంది.

Must Read : Viral video : కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఈ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా ..? తెలిస్తే బిత్తరపోతారు !