Ram Charan : తన క్రికెట్ టీమ్ ను పరిచయం చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

Ram Charan  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తన లైఫ్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజెస్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ 15వ సినిమాగా చేస్తున్న ” గేమ్ చేంజర్ ” సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. […]

  • Published On:
Ram Charan : తన క్రికెట్ టీమ్ ను పరిచయం చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

Ram Charan  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తన లైఫ్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజెస్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ 15వ సినిమాగా చేస్తున్న ” గేమ్ చేంజర్ ” సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కీర అద్వానీ నటించనున్నారు.

క్రికెట్ టీమ్ ను పరిచయం చేసిన చరణ్.. ప్రోమో చూసారా - Ram Charan The Proud Of Owner Of Hyderabad Team Tollywood

ఇక ఈ సినిమాపై భారి అంచనాలు ఉండడంతో సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనేది ఇప్పటివరకు తెలియదు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ఒకవైపు షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ ఇచ్చిన అప్డేట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే… మన భారతదేశంలో సినిమాలను ఎంతగా ఇష్టపడతారో క్రికెట్ ను కూడా అంతే ఇష్టపడతారు. సినిమా హీరోలకు అభిమానులు ఉన్నట్లుగానే స్టార్ క్రికెటర్లకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు.

ఈ క్రమంలోని తాజాగా రామ్ చరణ్ క్రికెట్ టీమ్ తో రాబోతున్నాడని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేస్తూ తాను ఓనర్ షిఫ్ తీసుకున్న టీమ్ ను పరిచయం చేశాడు. షార్ట్ ఫార్మేట్ లో కొత్తగా వచ్చిన క్రికెట్ లీడ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ( ISPL )లో తన జట్టు కూడా పాల్గొనబోతుందంటూ అభిమానులకు పరిచయం చేశాడు. తాను హైదరాబాద్ టీంకు బాస్ గా సారథ్యం వహించనునట్లు తెలియజేశారు. మరి రామ్ చరణ్ కొత్తగా మొదలుపెట్టిన జర్నీ సక్సెస్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ రాంచరణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.