Chiranjeevi : రేవంత్ రెడ్డిని విపరీతంగా పొగిడిన చిరంజీవి…

Chiranjeevi  : తాజాగా తెలంగాణకు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది.ఇక ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ వేదిక సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన […]

  • Published On:
Chiranjeevi : రేవంత్ రెడ్డిని విపరీతంగా పొగిడిన చిరంజీవి…

Chiranjeevi  : తాజాగా తెలంగాణకు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది.ఇక ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ వేదిక సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ…” ఎక్కడైతే కళాకారులు సత్కరించబడతారరో గౌరవించబడతారో ,ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలియజేశారు. అయితే కళాకారులకు అవార్డు వచ్చిందని ప్రభుత్వం స్పందించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు.

కళాకారులను సత్కరించడం గతంలో కూడా ఎప్పుడు జరగలేదు.ఇలా జరగటం ఇదే మొదటిసారి. దీని అంతటికి గల ముఖ్య కారణం మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనవారిని మనం సత్కరించుకోకపోతే ఎలా అని రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ చిరంజీవి తెలియజేశారు. కళాకారులకు కొత్త ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత గురించి కొనియాడుతూ వారు చూపే ప్రేమకు నా మనసు పులకరించిపోతుందని తెలియజేశారు.అయితే గతంలో నంది అవార్డులు కూడా ఇచ్చుకునే వాళ్ళం కానీ రాను రాను ఇరు రాష్ట్రాల్లో అది ఒక గత చరిత్రలగా మిగిలిపోయింది.ఇక ఆ విషయంలో మా అందరికీ కూడా చాలా అసంతృప్తి ఉంది. ఈ సమయంలోనే కళాకారులను ఎందుకు ఇంతలా నిరుత్సాహపరుస్తున్నారు అని అనిపించేది.

ఎందుకంటే అవార్డులు ఇవ్వడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇక కళాకారులను అవార్డులతో సత్కరించడం వలన వారికి కాస్త ప్రోత్సాహం లభించి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అలా సినీరంగం , నాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ఆదరణ లభిస్తుంది అంటే జనం ఇచ్చిన ప్రోత్సాహం అనడంలో ఎలాంటి సందేహం లేదని చిరంజీవి తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వాల నుండి కూడా ప్రోత్సాహం దక్కితే మన ఇండస్ట్రీ ఇంకో స్థాయికి వెళుతుందంటూ తెలియజేశారు. ఇక ఈ విషయాన్ని ఈనాడు మన ప్రభుత్వం గుర్తించింది. అందుకే నంది అవార్డులను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మరిముఖ్యంగా వారి పాటే ప్రాణంగా బతికిన ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పై అవార్డును ఇవ్వడం నిజంగా అభినందనీయం. దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అని చిరంజీవి తెలియజేశారు.