Chiranjeevi : త్రిషకి అండగా నేనుంటా…చిరంజీవి సంచలన కామెంట్స్..

Chiranjeevi  : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఖండిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తమిళ్ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ నే కాదు ఏ […]

  • Published On:
Chiranjeevi : త్రిషకి అండగా నేనుంటా…చిరంజీవి సంచలన కామెంట్స్..

Chiranjeevi  : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఖండిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తమిళ్ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ నే కాదు ఏ స్త్రీని అనకూడదు. ఈ వ్యాఖ్యలను కచ్చితంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా సరే నేను అండగా ,సపోర్ట్ గా ఉంటానని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించడంతో ఇది మరింత వివాదంగా మారింది.

i-am-with-trisha-chiranjeevi-sensational-comments

అసలేం జరిగిందంటే….

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ లియో సినిమాలో త్రిష గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సినిమాలలో నేను రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిష తో అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్ లేకపోవడం నిజంగా బాధను కలిగించిందంటూ మన్సూర్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అయింది.

i-am-with-trisha-chiranjeevi-sensational-comments

 

వీడియో వైరల్ అవ్వడం తో మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ పై హీరోయిన్ త్రిష కూడా స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన మాటలు నా దృష్టికి వచ్చాయని , ఆయన చేసిన వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను …ఇలాంటి వారితో ఇంకెప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త పడతా అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దీంతో త్రిష కి మద్దతుగా సినీ సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు.