Viral Video : బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకిన మహిళ… అది గమనించిన పెంపుడు శునకం ఏం చేసిందో చూడండి…

Viral Video : శునకాల విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే…పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యానం ఎదురులంక మధ్యనున్న జిఎంసి బాలయోగి వంతెన పై ఓ పెంపుడు శునకం కనిపించింది. అయితే అది ఎక్కడకి వెళ్లకుండా రాత్రంతా అక్కడే ఉండి ,కళ్ళు కాయలు కాచేలా […]

  • Published On:
Viral Video : బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకిన మహిళ… అది గమనించిన పెంపుడు శునకం ఏం చేసిందో చూడండి…

Viral Video : శునకాల విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే…పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యానం ఎదురులంక మధ్యనున్న జిఎంసి బాలయోగి వంతెన పై ఓ పెంపుడు శునకం కనిపించింది. అయితే అది ఎక్కడకి వెళ్లకుండా రాత్రంతా అక్కడే ఉండి ,కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ కనిపించింది. అయితే ఇది గమనించిన కొందరు ఏంటాని దగ్గరికి వెళ్లి చూడగా అసలు నిజం బయటపడుతుంది. దీంతో ఈ ఘటన ను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్ లో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకెళ్తే

యానం రోడ్డు లో మందంగి కాంచన అనే ఓ 22 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటుంది. ఆమె తన తల్లి హోటలను నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఆదివారం సాయంత్రం కాంచన తన పెంపుడు కుక్క ని తీసుకుని యానం ఎదురులంక మధ్యనున్న జిఎంసి బాలయోగి వంతెన పైకి వాకింగ్ కి వెళ్ళింది. ఇక అక్కడ రోజు మాదిరిగానే కాసేపు వాకింగ్ చేసింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ తన పాదరక్షలు అక్కడే విడిచి నదిలోకి దూకేసింది. అదే సమయానికి అక్కడే ఉన్న కొందరు అమ్మాయి నదిలో దూకడం చూసి ,వెంటనే అక్కడికి చేరుకొని నదిలో చేపలు పట్టే మత్స్యకారుల సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కానీ యువతి మృతదేహం మాత్రం ఇప్పటివరకు లభించలేదు. అయితే తనతో పాటు తీసుకువచ్చిన తన పెంపుడు కుక్క మాత్రం తనకోసం ఎదురు చూస్తూ బ్రిడ్జ్ పైన ఉండిపోయింది. తన యజమాని తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూడ సాగింది. రాత్రంతా అక్కడే ఉండి యజమాని పాదరక్షలు వద్ద పడుకుంది. ఇది గమనించిన స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి . యజమాని కోసం శునకం పడుతున్న ఆవేదన అందరికంట కన్నీరు పెట్టించింది. మరుసటి రోజు యజమాని తల్లి రావడంతో పెంపుడు కుక్క తనతో వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా యువతీ ఆత్మహత్య వెనక గల కారణాలు తెలుసుకోవడానికి యానాం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు. సమాచారం దొరికిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.