Minister Roja : మినిస్టర్ రోజా అవుట్ నటుడు సుమన్ వైఎస్ జగన్ కీలక నిర్ణయం…
Minister Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో చాలామంది సిట్టింగులకు సీటు ఇవ్వకుండా కొత్తవారికి సీటు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిలను ప్రకటించారు. అయితే ఈసారి ప్రస్తుతం మంత్రి గా ఉన్న ఆర్కే రోజా ఈ జాబితాలో చేరిపోయారు. అయితే ఆమెను రాష్ట్ర రాజకీయాల నుండి తప్పించి ఢిల్లీ స్థాయి లీడర్ గా మార్చాలని నిర్ణయం […]
Minister Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో చాలామంది సిట్టింగులకు సీటు ఇవ్వకుండా కొత్తవారికి సీటు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిలను ప్రకటించారు. అయితే ఈసారి ప్రస్తుతం మంత్రి గా ఉన్న ఆర్కే రోజా ఈ జాబితాలో చేరిపోయారు. అయితే ఆమెను రాష్ట్ర రాజకీయాల నుండి తప్పించి ఢిల్లీ స్థాయి లీడర్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సినిమాలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన మరో నటుడు సుమన్ కూడా వైసిపి ఎంపి గా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు సినీ సెలబ్రిటీల నీ ఒకరిని రాజకీయ ఈక్వేషన్స్ లో భాగంగా ఎంపీగా నిలబెట్టాలని చూస్తుంటే మరొకరిని ఈసీ బోర్డును కాపాడుకునేందుకు బరిలోకి దింపాలి అని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏపీలో అధికార వైసిపి ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వారిని పోటీకి సిద్ధం చేస్తుంది. మరికొందరి నియోజకవర్గం మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది.
ఇందులో భాగంగానే నగరి ఎంపీ ఆర్కే రోజు కు ఈసారి టికెట్ ఇవ్వకుండా లోక్ సభ ఎన్నికల బరిలో నిలబెట్టాలని వైసిపి పార్టీ ప్లాన్ చేశారంట. దీనిలో భాగంగానే ఒంగోలు లోక్ సభ అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యారని సమాచారం . గత ఎన్నికల్లో భాగంగా ఒంగోలు మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. ఒంగోలులో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.ఐక ఇక్కడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని వైసిపి పార్టీ పెద్దలు ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. ఒకటి రెండు రోజులు అధికార ప్రకటన కూడా వినబడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసిపి అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆమె పేరుని రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీని కార్యనిర్వాహకర్త విజయ్ సాయి రెడ్డి సమాచారమిచ్చినట్లు టాక్. అయితే ఒంగోలు ఎంపి స్థానానికి ఆర్కే రోజా కంటే ముందు జవ రెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పరిశీలించారు.
మాజీ మంత్రి పాలనేని శ్రీనివాస్ రెడ్డితో జిల్లాలోని నాయకులంతా వారి ప్రతిపాదన వ్యతిరేకించినట్లు తెలుస్తుంది.దీంతో రోజా కి పోటీ సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగుతుంది.దీంతో టీడీపీ కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ కూటమితో సినీ గ్లామర్ ప్లస్ అవుతుందేమోనని వైసిపి భావిస్తుందని కనిపిస్తుంది. అందుకే తన పార్టీ తరఫున కూడా సినీ గ్లామర్ పెంచాలని సినిమా వాళ్ళని ఎన్నికల పోటీలో దించాలని వైసీపీ భావిస్తుంది. అందులో భాగంగానే గతంలో రాజమండ్రిలో లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన మార్గానిక్ భరత్ ని ఈసారి ఎమ్మెల్యేగా నిలబడుతుంది. ఆ స్థానంలో సినీ నటుడు సుమన్ అయితే బాగుంటుందని భావిస్తుంది. వైసిపి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది. రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా సుమన్ నిలబట్టడంతో ప్రధానంగా బీసీ ఓట్లను కాపాడుకోవడం లక్ష్యం అని అన్నట్లుగా కనిపిస్తుంది. నటుడు సుమన్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎంపీగా పోటీ చేస్తే బీసీ ఓట్లు గుంపు గుర్తుగా పడే ఛాన్స్ ఉంటుందని వైసిపి భావిస్తుంది.