Wedding : మూడుముళ్లకు ముప్పు తెచ్చిన మేకప్..పెళ్లి పీటల నుండి వెళ్లిపోయిన వరుడు..

Wedding : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లిలో తాము అందంగా కనిపించాలని పెళ్ళికొడుకు పెళ్ళికూతురురు ఊబలాట పడుతుంటారు. పెళ్లికూతురు అయితే మరీను. అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్స్ ను ఆశ్రయిస్తుంటారు. పెళ్లిలో అందంగా కనిపించాలని రకరకాల ఫెసియల్స్ ను,మేకప్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. అదే ఓ మహిళ కొంప ముంచింది. పెళ్లిలో అందంగా కనిపించాలని ఆమె వేసుకున్న మేకప్ పెళ్లి ఆగిపోయేలా చేసింది. మరో కొన్ని గంటల్లో […]

  • Published On:
Wedding : మూడుముళ్లకు ముప్పు తెచ్చిన మేకప్..పెళ్లి పీటల నుండి వెళ్లిపోయిన వరుడు..

Wedding : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లిలో తాము అందంగా కనిపించాలని పెళ్ళికొడుకు పెళ్ళికూతురురు ఊబలాట పడుతుంటారు. పెళ్లికూతురు అయితే మరీను. అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్స్ ను ఆశ్రయిస్తుంటారు. పెళ్లిలో అందంగా కనిపించాలని రకరకాల ఫెసియల్స్ ను,మేకప్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. అదే ఓ మహిళ కొంప ముంచింది. పెళ్లిలో అందంగా కనిపించాలని ఆమె వేసుకున్న మేకప్ పెళ్లి ఆగిపోయేలా చేసింది. మరో కొన్ని గంటల్లో పెళ్లి అనగా పెళ్లికూతురు బ్యూటీ పార్లర్ కు వెళ్లి మొహంను వికృతంగా చేసుకొని వచ్చింది దీంతో పెళ్లి కూడాా రద్దయింది.. కర్ణాటకలో అస్సాం జిల్లా లోని ,అర్సికేరే జాజుర్ గ్రామానికి చెందిన మహిళకి వెళ్లి నిశ్చయమైంది.

పెళ్లిలో తాను ఎలాగైనా అందంగా కనిపించాలని ఆత్రుతతో, ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా మేకప్ కోసమని గంగా శ్రీ హెర్బల్ పార్లర్ అనే పార్లర్ కు పెళ్లికూతురు వెళ్ళింది. ఈ క్రమంలో “బ్యూటిషన్” పెళ్లి కుమార్తె ముఖంపై కొన్ని రకాల క్రీమ్స్ ను పూశాడు. దీంతో ఆమె ముఖం కందిపోయి నల్లగా మారింది. ఆ క్రీమ్స్ రాసిన తర్వాత ముఖం మొత్తం ఉబ్బి వికృతంగా మారింది. బ్యూటిషన్ వేసిన మేకప్ కారణంగానే అలర్జీ రావడంతో మొఖం వాచిపోయింది. దీంతో పెళ్లి కూతురు తనను తాను చూసుకుని ఒకసారిగా షాక్ అయింది. ఆమె ఇంటికి చేరుకోగా చూసిన బంధువులు కూడా ఆశ్చర్యపోయారు.

ఆమె ముఖాన్ని చూసిన వరుడు భయపడి పెళ్లి వద్దంటూ అక్కడనుండి వెళ్లిపోయాడు. తన మొహం ఇలా అవడంతో ఏంటిది అని బ్యూటిషన్ ను అడగగా, కొత్త తరహా మేకప్ ను వేసినట్లు బ్యూటిషన్ తెలిపారు. ఆ మేకప్ వలన మొఖం వికటించడంతో బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఇలా జరగడానికి కారణమైన బ్యూటిషన్ పై బాధితురాలు కేసు నమోదు చేసింది. పోలీసులు బ్యూటిషన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా వైరల్ గా మారింది. పెళ్లిలో అందంగా కనిపించాలి అనుకోవడం మంచిదే కానీ, రకరకాల మేకప్స్ ను వాడితే ఇలాగే అవుతుందని అందరూ అంటున్నారు.